Prashanth Varma: అలాంటి సమస్యతో బాధపడుతున్న హనుమాన్ డైరెక్టర్..!

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతి తక్కువ బడ్జెట్ పైగా యంగ్ హీరోతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించేసారు. ఎటువంటి మార్కెట్ లేని యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా కేవలం రూ.60 కోట్ల బడ్జెట్తో భారీ పాన్ ఇండియా చిత్రంగా హనుమాన్ చిత్రాన్ని తాజాగా సంక్రాంతి సందర్భంగా తీసుకొచ్చి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు గుంటూరు కారం చిత్రంతో పోటీకి దిగి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని.. మహేష్ బాబు సినిమాని సైతం కలెక్షన్ల పరంగా దాటేసి తమ సత్తా ఏంటో చాటారు.

ఇకపోతే బుక్ మై షో లో 50K మందిపైగా యూసర్లు 9.6 రేటింగ్ ఇచ్చి సంక్రాంతి సినిమాలలో విన్నర్ గా నిలబెట్టారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన ఒక ట్వీట్ తెగ వైరల్ గా మారుతుంది. ప్రశాంత్ వర్మ.. తనకు మూడు రోజుల నుంచి బాగా జ్వరంగా ఉందని.. అందుకే అందరి కాల్స్ మెసేజ్లు తాను ఎత్తడం లేదని ఒకసారి తనకు ఆరోగ్యం బాగా అయ్యాక అందరికీ రిప్లై ఇస్తానని చెబుతూ అందరికీ తన క్షమాపణలు అంటూ ఒక ట్వీట్ వేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త వైరల్ అవుతోంది.

ఇకపోతే ప్రశాంత్ వర్మ జ్వరంతో బాధపడుతున్నట్టు నిన్న ట్వీట్ వేయగా.. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు త్వరగా కోలుకోవాలని వెంటనే హాస్పిటల్ కి వెళ్లి వైద్యుల సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా సూపర్ హిట్ సాధించడంతో దర్శకుడు ప్రశాంత్ వర్మకి వరుసగా మెసేజ్ లు, కాల్స్ వస్తున్నాయట.. అయితే ఆయన ఆరోగ్యం బాగో లేకపోవడం వల్ల ఎవరికి రిప్లై ఇవ్వలేదు.. దీంతో ఎందుకు ప్రశాంత్ వర్మ ఎవరికి అందుబాటులోకి రాలేదు అని ఆరా తీస్తున్న నేపథ్యంలో ఈ ట్వీట్ షేర్ చేసి క్లారిటీ ఇచ్చారు దర్శకుడు ..మొత్తానికైతే జ్వరం అనే సమస్యతో ఆయన బాధపడుతుండడం వల్లే ఎవరికి రిప్లై ఇవ్వడం లేదని సమాచారం. ఇకపోతే కలెక్షన్స్ విషయానికి వస్తే రెండు రోజుల్లోనే రూ.21 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు