Sunny leone: సన్నీలియోన్ నెల సంపాదన తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

సన్నీలియోన్ గురించి అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పలు ఐటెం సాంగ్స్ లో నటిస్తూ భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె..ముఖ్యంగా బాలీవుడ్లో తన మార్క్ చూపిస్తోంది. ప్రస్తుతం అంతగా హిట్స్ లేకపోయినా.. నిలదొక్కుకుంటూ తన ప్రస్తానాన్ని సాగిస్తున్న ఈమె నెలవారీ ఆదాయం తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే.. తమిళ్ , తెలుగు , మలయాళం సినిమాలలో కూడా స్పెషల్ సాంగ్స్ చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకున్న సన్నీలియోన్ తాజాగా రెడ్ ఆఫ్ షోల్డర్ బాడీ కాన్ డ్రెస్ వేసుకొని ఫోటోషూట్ షేర్ చేసింది. ఇందులో ఈమె చాలా ఆకర్షణీయంగా కనిపించడమే కాదు అందరి దృష్టిని ఆకర్షించింది కూడా..

ముఖ్యంగా తన ఫోటోషూట్లతో తక్కువ మేకప్ .. అతి తక్కువ నగలతో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకున్న ఈమె.. పలు యాడ్స్ కూడా చేస్తున్న విషయం తెలిసిందే .ఇదిలా ఉండగా సన్నీలియోన్ ఒక ప్రాజెక్టు కోసం రూ.3కోట్ల వరకు తీసుకుంటుంది. స్పెషల్ సాంగ్స్ కి రూ .2కోట్ల వరకు పారితోషకం తీసుకునే ఈమెకు సొంత వ్యాపారాలు కూడా ఉన్నాయి. అంతేకాదు బ్యూటీ ప్రోడక్ట్ బ్యాండ్ ని ఆమె స్వయంగా నడుపుతోంది. దీన్ని ద్వారా నెలకు కోటి రూపాయలు సంపాదిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ప్రస్తుతం సినిమాలలో పెద్దగా నటించకపోయినా.. అన్ని రోజులూ షూటింగ్లో బిజీగా ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ఆమె చాలా ప్రాజెక్ట్ ల ద్వారా అంతకుమించి సంపాదిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం హిందీ, తెలుగులో అవకాశాలు బాగా వెలువడడంతో ఇతర భాషలలో కూడా భారీ పాపులారిటీ దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది అని చెప్పవచ్చు.

ఇకపోతే ఆమెలో ఉన్న గ్లామర్ ని చూపిస్తున్నారు తప్ప ఆమెలో ఉన్న నటనా ప్రతిభను ఏ ఒక్క దర్శకుడు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం లేదు. హీరోయిన్ కాలేకపోయినా ఈమె ఇలా ఐటెం సాంగ్స్ తో సరిపెట్టుకుంది.ఇక మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు రకాల పోస్టుల ద్వారా కూడా భారీగానే సంపాదిస్తోందని చెప్పవచ్చు. ఒకవైపు సినిమాలు మరొకవైపు యాడ్స్ అలాగే సొంత వ్యాపారాల ద్వారా భారీగా సంపాదించిందని.. ఇక మొత్తంగా ఈమె ఆస్తి విలువ రూ.120 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు