NTR’s Devara: ఇంత సైలెన్స్ ఏంటి దేవర – ప్లానింగా?, భయమా..?

NTR’s Devara

యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో దేవర సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. చాలా కాలం మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ లో నటిస్తున్నాడు.

రీసెంట్ గా భారీ యాక్షన్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మరో షెడ్యూల్ తావరలోనే స్టార్ట్ కానుంది. షూటింగ్ అయితే, గ్యాప్ లేకుండా జరుగుతోంది కానీ, సినిమాకు సంబంధించిన ఏ ఒక్క అప్డేట్ కూడా బయటకు రాకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

షూటింగ్ సమయంలో ఎటువంటి అప్డేట్స్ లీక్ కాకుండా సినిమా యూనిట్ జాగ్రత్త పడుతోందని తెలుస్తోంది. డైరెక్టర్ కొరటాల శివ పక్కా ప్లానింగ్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఆచార్య ద్వారా ఘోర డిజాస్టర్ అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాతో తానేంటో ప్రూవ్ చేసుకోవాలన్న కసితో ఈ సినిమా చేస్తున్నాడు కొరటాల.

- Advertisement -

RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా ఎదిగిన నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో వైలెన్స్ బీభత్సంగా ఉంటుందని టాక్ ఉంది. ఆ మధ్య రిలీజైన గ్లిమ్ప్స్ కూడా ఇదే ఫీల్ ఇస్తుంది. ఈ నేపథ్యంలో దేవర గురించి ఎలాంటి అప్డేట్ వదలకపోవటం ప్లానింగా లేక, ఏప్రిల్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న ఈ సినిమా అప్డేట్స్ ఇంత ముందుగా వదిలితే రిలీజ్ నాటికి సినిమాపై హైప్ పోతుందన్న భయమా అన్న కామెంట్స్ వస్తున్నాయి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు