Ayidhya Ram Mandir : అయోధ్య నుంచి ఆహ్వానం… డుమ్మా కొడుతున్న తారక్

అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట గురించి యావత్ భారతదేశం అంతా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోంది. జనవరి 22న జరగబోతున్న ఈ మహోన్నత కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం కోసం ఎన్నో ఏర్పాట్లు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న పలువురు సెలబ్రిటీలకు కూడా ఆహ్వానాన్ని పంపించింది. టాలీవుడ్ నుంచి పలువురు స్టార్ హీరోలకు ఇన్విటేషన్ అందింది. అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. కానీ ఆయన ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టబోతున్నట్టు వార్తలు వినబడుతున్నాయి.

బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమ మహోత్సవాన్ని విజయవంతంగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు తల మునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ కార్యక్రమానికి ఎవరెవరు హాజరు కాబోతున్నారు అన్న విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కొంతమంది సినీ ప్రముఖులకు స్వయంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే ఆహ్వాన పత్రికను అందించారు. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మోహన్ బాబుతో పాటు చాలామంది ఈ మహోన్నత కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ఇన్విటేషన్ వచ్చినట్టు సమాచారం. కానీ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదన్నది ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారం.

ఆ రూమర్స్ ప్రకారం ఎన్టీఆర్ ఇప్పటికే “దేవర” షూటింగ్ కోసం బల్క్ డేట్స్ కేటాయించాడట. సినిమా షూటింగ్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే ఎన్టీఆర్ కు అయోధ్యకు వెళ్లడం కుదరదని, అందుకోసమే ఆయన అయోధ్యకు వెళ్లడం లేదని టాక్ నడుస్తోంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ముందు అనేది తెలియదు కానీ అయోధ్యలో జరుగుతున్న ఈ మహోన్నత కార్యక్రమానికి ఎన్టీఆర్ హాజరు కావడం లేదంటూ వస్తున్న వార్తలు ఆయన అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇక “దేవర” విషయానికి వస్తే… ఇప్పటికే 80 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకున్న “దేవర” ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతోంది. దాదాపు నెల రోజుల గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ “దేవర” షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. డైరెక్టర్ కొరటాల శివ కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేసి ఏడు రోజుల పాటు అల్యూమినియం ఫ్యాక్టరీలో “దేవర” టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత “దేవర” పాటల షూటింగ్ జరగనుంది.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు