Dhamki: విశ్వక్‌ ఈవెంట్‌లో హను.. కారణం అదేనా ?

యంగ్ హీరో విశ్వక్ సేన్ నుంచి వస్తున్న కొత్త సినిమా దాస్ క ధమ్కీ. ఈ సినిమాలో విశ్వక్ హీరోగానే కాదు.. స్వయంగా దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. కాగా దీనికి ప్రసన్న కుమార్ బెజవాడ కథను అందించాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శుక్రవారం రాత్రి శిల్పకళా వేదికలో గ్రాండ్ గా జరిగింది. దీనికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. తారక్ తో పాటు సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి కూడా ఈ ఈవెంట్ కు వచ్చాడు.

ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ అన్నారు. మరి హను రాఘవపూడి.. దాస్ క ధమ్కీ ఈవెంట్ కు ఎందుకు వచ్చారు అనే ప్రశ్న ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతుంది. దీనిపై పలువురు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. అలా ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. అదేంటంటే.. విశ్వక్ సేన్ తన తర్వాత సినిమాను హను రాఘవపూడి దర్శకత్వంలో చేయబోతున్నారట. అందుకే ధమ్కీ సినిమా ఈవెంట్ కు హను ను గెస్ట్ గా పిలిచారని టాక్.

దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ, విశ్వక్ సేన్, హను రాఘవపూడి కాంబినేషన్ లో సినిమా రావడం దాదాపు ఖాయమే అని తెలుస్తుంది. ఈవెంట్ లో హను మాట్లాడే క్రమంలో కూడా.. తాను విశ్వక్ యాక్టింగ్ అభిమానిని అని, అటు యాక్టింగ్, ఇటు డైరెక్షన్ చేయడం మామూలు విషయం కాదని, అలాంటి పనులు విశ్వక్ చేస్తున్నాడు అంటూ ఈ యంగ్ హీరోపై పోగడ్తల జల్లు కురిపించాడు. దీంతో వీరి కాంబోలో సినిమా వస్తుంది అంటూ వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది.

- Advertisement -

ఒక వేళ ఈ వార్త నిజమైతే, లవ్ స్టోరీస్ తో సినిమా చేసే హను, మాస్ కథలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న విశ్వక్ సేన్ కాంబినేషన్ లో సినిమా వస్తే.. అది ఎలా ఉంటుంది ? ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది ? అనే ఆలోచనలు రాక మానదు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు