NBK: బాబాయ్ అంటే అబ్బాయికి పడదా – అందుకే దూరంగా ఉంటున్నాడా..?

నందమూరి హీరోలలో సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్. బాలకృష్ణ తర్వాత అటు రాజకీయాల్లో, ఇటు సినీ రంగంలో నందమూరి లెగసీని క్యారీ చేసే అర్హత, సత్తా ఒక జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రమే ఉందని అభిమానులే కాకుండా ప్రేక్షకులు కూడా యాక్సెప్ట్ చేస్తారు. అయితే, కారణం ఏంటన్నది తెలీదు కానీ, గత కొంత కాలంగా బాలకృష్ణ, తారక్ ల మధ్య దూరం పెరిగినట్లు కనిపిస్తుంది. అటు రాజకీయ వేదికలపై కానీ, సినిమా ఈవెంట్స్ లో కానీ ఇద్దరు కలిసి కనపడి చాలా కాలం అయ్యింది. ఆ మధ్య తారకరత్న పెద్ద కర్మ సందర్బంగా జూనియర్ ఎదురుపడిన కూడా బాలయ్య పలకరించకపోవటం, ఇటీవల జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు తారక్ హాజరు కాకపోవటంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్నది స్పష్టం అవుతోంది. ఇక తాజాగా బాలకృష్ణ బర్త్ డే సందర్బంగా మరోసారి ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.

బాలకృష్ణ బర్త్ డే సందర్బంగా రాజకీయ ప్రముఖులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు, కుటుంబ సభ్యులు విషెస్ చెప్పారు. కానీ, ఎన్టీఆర్ నుండి విషెస్ మాత్రం రాలేదు. ఇదే ఫస్ట్ టైం అయితే షూటింగ్ బిజీలో ఉండి మరిచిపోయి ఉండచ్చని అనుకోవచ్చు. కానీ గత మూడు సంవత్సరాలుగా బాలకృష్ణ బర్త్ డేకి ఎన్టీఆర్ నుండి విషెస్ రాలేదు. దీంతో బాలకృష్ణ అభిమానులు ఎన్టీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తోటి హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వారికి కూడా విషెష్ చెప్పడంలో ముందుండే ఎన్టీఆర్ సొంత బాబాయ్ పుట్టినరోజుకు సైలెంట్ గా ఉండటం వారి మధ్య విబేధాలున్నాయని క్లారిటీ వస్తుంది.

బాలకృష్ణ అభిమానుల ఆగ్రహం మాట పక్కన పెడితే, తారక్ అభిమానులు మాత్రం తమ హీరోని సమర్థిస్తున్నారు. నందమూరి కుటుంబం, ముఖ్యంగా బాలకృష్ణ ఎన్టీఆర్ ని ఎప్పుడూ ఎంకరేజ్ చేయలేదని, కావాలనే దూరం పెడుతూ వస్తున్నాడు కాబట్టే ఎన్టీఆర్ కూడా ఆ ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడని అంటున్నారు. ఇద్దరి మధ్య విభేదాలకు కారణం ఏంటో కానీ, ఈ అంశంపై తరచూ బాలకృష్ణ, తారక్ అభిమానుల మధ్య ఒక మినీ యుద్ధమే జరుగుతూ ఉంది. మరి, దీనికి ఫుల్ స్టాప్ పడే రోజు ఎప్పుడొస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు