Hebah Patel: బర్త్ డే రోజు కొత్త సినిమాలు.. కుమారి ఫుల్ హ్యాపీ

టాలీవుడ్ లో చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చి, కుమారి గా ఫేమస్ అయిన హెబా పటేల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కుమారి 21 F తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే గాకుండా, ఒకే ఇయర్ లో అరడజనుకి పైగా ఆఫర్లు దక్కించుకున్న ఈ గ్లామరస్ బ్యూటీ చిన్న సినిమాల్లో వరుసగా నటిస్తూ, చిన్న హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా మారింది. అయితే ఆ తర్వాత వరుసగా ప్లాపులు పలకరించడంతో ఛాన్సులు తగ్గాయి. ఓ దశలో సెకండ్ లీడ్ కాకుండా ఐటెం సాంగ్స్ కూడా చేసింది.

అయితే లాక్ డౌన్ తర్వాత మొత్తం కనిపించకుండా పోయింది. లాస్ట్ ఇయర్ ఏదో రెండు వెబ్ సిరీస్ లో మాత్రమే కనిపించింది. అలాంటి తరుణంలో అందరూ హెబా పని అయిపొయింది అన్నారు. అయితే తాజాగా హేభ పటేల్ బర్త్ డే రోజు వస్తే గాని తెలియలేదు. ఈ అమ్మడు తన ప్లానింగ్ లో తాను ఉందని. జనవరి 6న తన బర్త్ డే కి స్పెషల్ విష్ చేసిన కొందరు మేకర్స్, అందులో కొన్ని సినిమాల్లో హెబా పటేల్ ని ఆఫీషియల్ గా కంఫర్మ్ చేసారు.

ఒక్క తెలుగులోనే నాలుగు సినిమాల్లో నటిస్తున్న హెబా పటేల్, తమిళ్ లో రెండు సినిమాలు, కన్నడ లో ఓ సినిమా చేస్తూ ఫుల్ బిజీ అయింది. దాదాపు 7 సినిమాల్లో నటిస్తున్న హేబా పటేల్ ఏమి ఎరగనట్టు సోషల్ మీడియా లో సందడి చేస్తుంది. అయితే అన్ని చిన్న సినిమాలు కావడం వల్ల ఎవరికీ అంతగా తెలీదు. కానీ వీటిలో కంటెంట్ ఉన్న హిట్టు సినిమా ఒక్కటి పడితే చాలు హెబా పటేల్ మునుపటి రోజులు రావడం ఖాయం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు