Chiranjeevi: యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన మెగాస్టార్..!

యువ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల రిజల్ట్ తో ఆలోచనలో పడ్డ మెగాస్టార్ రీసెంట్ గా వాల్తేరు వీరయ్యతో హిట్ అందుకొని మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళా శంకర్ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక యువ దర్శకుడితో నెక్స్ట్ సినిమా చేసే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్లు తెలుస్తుంది. గత సంవత్సరం కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాతో ఎంట్రీ ఇచ్చి తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టిన వశిష్ట మల్లిడి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ యువ దర్శకుడికే చిరంజీవి తన నెక్స్ట్ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది.

బింబిసార సినిమా తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ ఉండబోతోంది అన్న టాక్ వినిపించింది, ఈ విషయాన్ని స్వయంగా కళ్యాణ్ రామ్ పలు ఇంటర్వ్యూల్లో కన్ఫర్మ్ చేశారు. అయితే ఆ తర్వాత సీక్వెల్ గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవటంతో ఇప్పట్లో ఆ సినిమా లేనట్లే అని తెలుస్తుంది. ఆ మధ్య బాలకృష్ణ, వశిష్టల కాంబినేషన్లో సినిమా ఉండబోతోంది అన్న టాక్ వచ్చినప్పటికీ బాలయ్య లైనప్ లో వరుసగా సినిమాలు ఉన్నాయి కాబట్టి ఇపుడిపుడే ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ లేదు.

చిరంజీవితో సినిమా కోసం స్టార్ డైరెక్టర్స్ నుండి అప్ కమింగ్ డైరెక్టర్స్ వరకు చాలా మంది ఎదురు చూస్తున్నప్పటికీ వశిష్టకు ఈ అవకాశం దక్కడం అదృష్టం అనే చెప్పాలి. చిరు, వశిష్టల కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఫాంటసీ నేపథ్యంలో ఉండబోతోందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి వశిష్ట ఒక లైన్ వినిపించగా చిరు అందుకు ఓకే చెప్పినట్లు కూడా చెప్పినట్లు కూడా సమాచారం. అన్ని సవ్యంగా సాగితే మెగాస్టార్ నుండి అంజి రేంజ్ లో త్వరలో సినిమా వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం బడ్జెట్ పరంగా ఎలాంటి లిమిటేషన్స్ లేవు కాబట్టి ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేయచ్చు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు