Janhvi Kapoor: అందుకే నా తల్లిని బాధ పెట్టాను- జాన్వీ కపూర్..!

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రస్తుతం కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న దేవర సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది ఈ బాలీవుడ్ బ్యూటీ.. ఇకపోతే తాజాగా ముంబైలో జరిగిన ఒక ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. తన తల్లి దివంగత నటి శ్రీదేవిని తలచుకొని ఎమోషనల్ అయింది. అంతేకాదు ఆమెపై చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే తన కెరియర్ ప్రారంభంలో శ్రీదేవిని దూరం పెట్టిన సందర్భాన్ని తెలుసుకొని మరింత బాధపడింది.

ఇకపోతే ధడక్ అనే సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈమె ఈ సినిమా షూటింగ్ సమయంలో తన తల్లి శ్రీదేవిని తన సినిమా షూటింగ్ లొకేషన్ కి రావద్దని చెప్పిందట. అయితే కొంతకాలానికి తన నిర్ణయం తప్పని తెలుసుకున్న ఆమె ఆవేదనను వ్యక్తం చేసింది.ఇదే విషయంపై జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. మా అమ్మకు ఉన్న పేరు ప్రతిష్టలు వాడుకొని నేను ఇండస్ట్రీలో కొనసాగుతున్నానని అందరూ అనుకునేవారు. అందుకే అమ్మను షూటింగ్ లోకేషన్ కి రావద్దని చెప్పేదాన్ని. నేను ఇండస్ట్రీకి వచ్చింది శ్రీదేవి వారసురాలి గానే.. అయినా నా పైన అమ్మ వారసత్వం తాలూకు ఛాయలు లేకుండా ఉండాలని ఇండస్ట్రీలో స్వతంత్రంగా ఎదగాలని ప్రయత్నించాను. అయితే కెరియర్ ఆరంభంలో ఏదో తెలియని అభద్రతాభావం ఉండేది. అంచనాలను అందుకోవాలని ప్రయత్నంలో ఒత్తిడికి గురయ్యేదాన్ని.

అమ్మ ఎలాంటి సలహాలు ఇచ్చినా సరే తీసుకునే దాన్ని కాదు కొంతకాలం గడిచాక నా నిర్ణయాలు తప్పు అని తెలుసుకొని బాధపడ్డాను. ఒకవేళ ఇప్పుడు అమ్మ ఉంటే కచ్చితంగా షూటింగ్ కి పిలిచి ఆనందంగా ఎన్నో విషయాలను పంచుకోవాలని అనిపిస్తోంది. ఆమె కూతురుగా పుట్టినందుకు గర్విస్తున్నాను అంటూ తల్లిని తలుచుకొని ఎమోషనల్ అయింది జాన్వి కపూర్ . ఇకపోతే జాన్వి కపూర్ హిందీ తో పాటు సౌత్ ఇండస్ట్రీ వైపు కూడా దృష్టి పెట్టింది. అటు తెలుగులో ఇటు బాలీవుడ్లో అవకాశాలు దక్కించుకుంటూ మరింత క్రేజ్ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. మరొకవైపు సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ తన గ్లామర్ షో తో యువతను అలరిస్తోంది.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు