Guntur Kaaram: ఘాటు రివర్స్ అయ్యిందా? ట్వీట్లు వేయడం, డిలీట్ చేయడం ఎందుకు నాగవంశీ?

ఊర మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ “గుంటూరు కారం” మూవీ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఆ చిత్ర నిర్మాత నాగ వంశీ తాను వేసిన పలు ట్వీట్లను డిలీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అసలు నిర్మాత నాగవంశీ ఆ ట్వీట్లను ఎందుకు వేశాడు? ఎందుకు డిలీట్ చేశాడు? “గుంటూరు కారం” ఘాటు ఆయనకే రివర్స్ అయ్యిందా? అంటే…

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ “గుంటూరు కారం”. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, శ్రీలీల మహేష్ బాబుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. తమన్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తుండగా, నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ నిర్మాత సినిమా హిట్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. కానీ తాజాగా జరిగిన పరిణామం చూస్తుంటే ఆయన కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతోందా అనిపిస్తోంది. రీసెంట్ గా “గుంటూరు కారం” మూవీ నుంచి రిలీజ్ చేసిన “ఓ మై బేబీ” సాంగ్ మహేష్ ఫ్యాన్స్ తో పాటు మిగతా వారిని కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో సోషల్ మీడియా వేదికగా మ్యూజిక్ కంపోజ్ చేసిన తమన్ పై, అలాగే లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రిపై, సాంగ్ ఇంత నాసిరకంగా వచ్చిన పట్టించుకోకుండా ఎలా ఉన్నాడంటూ త్రివిక్రమ్ పై ఘాటు విమర్శలు చేశారు నెటిజన్లు. అయితే వారికి చిత్ర బృందం నుంచి వచ్చిన రెస్పాన్స్ మాత్రం అందరిని షాక్ కు గురి చేసింది. పాటల రచయిత రామ జోగయ్య శాస్త్రి ఈ సాంగ్ విషయంలో విమర్శిస్తున్న వారిని కుక్కలతో పోల్చడంతో వివాదం మరింత పెద్దదయింది. దీంతో బాగుంది అని భజన చేసినప్పుడు తీసుకుంటారు కానీ, అదే బాగాలేదు అని విమర్శిస్తే మాత్రం కుక్కలు అంటారా అంటూ వారిపై విరుచుకుపడ్డారు. దీంతో రామ జోగయ్య శాస్త్రి సైలెంట్ గా ఏకంగా డిలీట్ చేసి పారేశాడు. ఇక ఆ తర్వాత రంగంలోకి దిగాడు నిర్మాత నాగ వంశీ.

సినిమా విషయంలో ఎప్పుడు ఏం చేయాలో మాకు బాగా తెలుసు అంటూ నెటిజెన్లకు మండేలా మరో ట్వీట్ వేసి వాళ్ళను గెలిచేసాడు. దానికోసం “అనిమల్” మూవీ పోస్ట్ క్రెడిట్ లో ఉండే ఒక సీన్ ను వాడుకున్నాడు. దీంతో కాపీ రైట్ కింద ఇతని ఎకౌంట్ లేపేయండి అంటూ నెటిజన్లు మళ్లీ వార్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే నాగ వంశీ “నిర్మాతగా నా సమాధానం మిమ్మల్ని బాధించింది. మా టీం అంతా ఈ సినిమా కోసం కష్టపడి పని చేస్తున్నాం. అలాంటప్పుడు కావాలని టార్గెట్ చేసి వ్యక్తిగత దూషణలు చేస్తే ఎలా అనిపిస్తుందో అర్థం చేసుకోండి. దారుణమైన పదాలు వాడకుండా ఏ రకమైన అభిప్రాయం వ్యక్తం చేసిన మేము స్వాగతిస్తాం. మీ అభిప్రాయాన్ని మీరు మర్యాదపూర్వకంగా కూడా తెలియజేయవచ్చు” అంటూ ట్వీట్ వేశాడు. తాజాగా ఆయన ఆ ట్వీట్లను డిలీట్ చేయడం మరో రకమైన చర్చకు దారి తీసింది. కొంతమంది అతను ఆ ట్వీట్లు డిలీట్ చేయడానికి కారణం యానిమల్ మూవీ క్లిప్ ను కాపీరైట్ చట్ట వ్యతిరేకంగా వాడుకోవడం వల్లే డిలీట్ చేశాడని అంటుంటే, ఇన్ సైడ్ రిపోర్ట్స్ ప్రకారం మాత్రం ప్రమోషనల్ కంటెంట్ గురించి అభిమానుల నుంచి ఫీడ్బ్యాక్ తో సంబంధం లేకుండా, దానిని సానుకూలంగా తీసుకోవాలని మహేష్ బాబు చిత్ర బృందానికి సూచించాడట. అలాగే దీన్ని ఇలాగే కొనసాగిస్తే సినిమాపై ఎఫెక్ట్ పడుతుందని మహేష్ బాబు సర్ది చెప్పాడట. మొత్తానికి “ఓ మై బేబీ” వివాదం ఇలా సద్దుమణిగింది. విమర్శల విషయంలో నిర్మాత, రామ జోగయ్య శాస్త్రి వ్యవహరించిన తీరు ఎవరికీ నచ్చలేదు. అలాగే “గుంటూరు కారం” సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి, వారి అంచనాలకు తగ్గట్టుగా లేకపోతే ప్రేక్షకులు అంగీకరించరు అన్నది నిజం.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు