Maruthi : స్టోరీ ఇదేనా ?

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న, చేయబోతున్న సినిమాల లైనప్ ఓ రేంజ్ లో ఉంది. బాహుబలి సినిమా తరువాత నుంచి పాన్ ఇండియా ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ.. సలార్, ఆది పురుష్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ సినిమాలు చేస్తున్నారు. ఇవే కాకుండా మరో సినిమాకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించనున్నారు. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతుందని టాక్.

ఈ సినిమాతో రెబల్ స్టార్ ను కొత్తగా చూడొచ్చట. కేవలం మూడు నెలల్లో షూటింగ్ అంతా పూర్తి చేసేలా ప్లాన్ చేశారట మారుతి. భారీ సెట్స్ అవసరం లేకుండా.. చిన్నగా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ప్రభాస్ – మారుతి కాంబినేషన్ లోని ఈ సినిమా ప్రారంభోత్సవం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కార్యాలయంలో జరిగింది. ప్రభాస్ ఇటలీలో ఉండడం వల్ల ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనలేదు. తాజాగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు తెరకెక్కుతున్నాయి.

ఈ వార్తల ప్రకారం ఈ మూవీ హర్రర్ – కామెడీ జానర్ లో తెరికెక్కనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటించనున్నారని తెలుస్తుంది. దీనికి “రాజా డీలక్స్” అనే టైటిల్ అనుకుంటున్నారని ప్రచారం సాగుతుంది. బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ దయ్యం పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. హైదరాబాద్ శివార్లో ఒక పాడు బడ్డ థియేటర్ సెట్ ను వేసి అక్కడే ఎక్కువ భాగం షూటింగ్ చేస్తారని తెలుస్తుంది. అలాగే ఈ చిత్రంలో ప్రభాస్ యాక్షన్ అంశాలతో పాటు మారుతి శైలి కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు