Gunturu karam : శ్రీలీలకి కూడా అదే గతి పట్టబోతోందా..? ఇక సినిమాలు లేనట్టేనా..

ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి అందరికి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు దాదాపు వాళ్ళ రాబోయే సినిమాలన్నిట్లో హీరోయిన్ గా శ్రీలీలనే నటిస్తుంది. ఇటీవలనే ఆమె పుట్టినరోజు సందర్బంగా ఈ యంగ్ హీరోయిన్ కి ఆమె నటిస్తున్న సినిమాల ప్రొడక్షన్ హౌసెస్ అన్నీ ఆమెకి బర్త్ డే విషెస్ చెబుతూ, పోస్టర్స్ రిలీజ్ చేయగా అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల. గతేడాది రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. బాడీలో స్ప్రింగ్ లు ఏమైన ఉన్నాయనేట్టుగా ధమాకా సినిమాలో మాస్ పాటలకి స్టెప్స్ వేస్తూ, అందరి దృష్టిని ఆకర్షించడంతో, శ్రీలీలకు సినిమా అవకాశాలు వర్ష కాలం వరదల్లాగా వచ్చి పడ్డాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాలతో పాటు విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని, లాంటి యంగ్ హీరోల సినిమాల్లోనూ నటిస్తుంది. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది.

టాలీవుడ్ హీరోయిన్స్ అందరి పరిస్థితి దాదాపు ఇలాగే స్టార్ట్ అయ్యింది. మొదట్లో వరుస సినిమాలతో హల్చల్ చేసి, ఆ తరువాత సినిమాలేవీ లేక మూలాన పడటం అందరి హీరోయిన్స్ కి జరుగుతూ వస్తున్నదే. కొత్తగా ఏ హీరోయిన్ అయిన పాపులర్ అవ్వగానే ఆమెకి వరుస సినిమా అవకాశాలు రావడం ఇదేమి తొలిసారి కాదు.
ఆ తరువాత అందరు హీరోలతో ఆ ఫలానా హీరోయిన్ వర్క్ చేసాక, ఇక ఆ హీరోయిన్ ని పరిశ్రమ అంత పక్కన పెట్టేయటం ఎప్పటినుంచే ఆచరణలో ఉన్నదే.

- Advertisement -

అయితే ఈ పరిస్థితి టాలీవుడ్ లో కనిపించడానికి ఉండటానికి కారణం, మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొని టాలీవుడ్ హీరోలు , దర్శకులు రెండోసారి హీరోయిన్ ని రిపీట్ చేయకపోవటమే. సమంత, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, తమన్నా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది కెరీర్ ఇలాగే సాగింది. అయితే ఈ లిస్ట్ లోకి శ్రీలీల కూడా తొందర్లోనే వచ్చే అవకాశం ఉన్నట్టు తెల్సుతోంది.

కెరీర్ తొలినాళ్ళలోనే అందరి హీరోలతో వర్క్ చేసే అవకాశం శ్రీలీలకు రావడంతో, రాబోయే రోజుల్లో ఈమెకి అసలు సినిమాలుంటాయా అనే ప్రశ్న తలెత్తుంది. ఒకవేళ ప్రస్తుతం శ్రీలీల చేస్తున్న సినిమాలన్నీ హిట్ అయితే ఆమె కెరీర్ కి ఏ డోకా ఉండదు, కానీ ఫ్లాప్ అయితే మాత్రం ఈ హీరోయిన్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అనే ట్యాగ్ మోయాల్సి రావడానికి  ఎంతో కాలం లేదనిపిస్తోంది. ముందు ముందు ఈ యంగ్ హీరోయిన్ కెరీర్ అందరిలానే ఉంటుందో లేక సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుందో చూడాలి

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు