Agent: సురేందర్ రెడ్డికి గోల్డెన్ ఛాన్స్ – ఈసారైనా ప్రూవ్ చేసుకుంటాడా..?

అఖిల్ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమా డిజాస్టర్ అవ్వటానికి కారణం సురేందర్ రెడ్డే అంటూ ఇండస్ట్రీ వర్గాల నుండి సామాన్య ప్రేక్షకుడి వరకు అందరూ ఒకే అభిప్రాయానికి వచ్చారు. అఖిల్ పడ్డ రెండేళ్ల కష్టాన్ని వృధా చేశాడంటూ అక్కినేని అభిమానులు ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఏజెంట్ ఫలితం ప్రభావం సురేందర్ రెడ్డిపై పడుతుందని, ఇక అతని కెరీర్ కి సుదీర్ఘ గ్యాప్ రావటం ఖాయమని భావించారు అందరూ. ఈ నేపథ్యంలో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అల్లు అరవింద్ లాంటి మెగా ప్రొడ్యూసర్ తో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నాడు సురేందర్ రెడ్డి.

2018 సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న నిర్మాత అల్లు అరవింద్ స్వయానా ఈ విషయాన్ని వెల్లడించాడు. సురేందర్ రెడ్డి ఈ సినిమా కోసం కథ సిద్ధం చేసే పనిలో పడ్డాడని సమాచారం అందుతోంది. అయితే, ఈ సినిమాలో హీరో ఎవరు వంటి అంశాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఏజెంట్ లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత సురేందర్ రెడ్డికి ఈ అవకాశం రావడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది ఇండస్ట్రీ వర్గాల్లో.

ప్రస్తుతం అల్లు అరవింద్ బోయపాటితో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. రామ్ బోయపాటి సినిమా తర్వాత గీత ఆర్ట్స్ బ్యానర్ పై బోయపాటి సినిమా ఉండనుంది. ఆ తర్వాత సురేందర్ రెడ్డితో సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. మరి, అల్లు అరవింద్ సినిమా కోసం సురేందర్ రెడ్డి ఎలాంటి కథను సిద్ధం చేస్తాడు, ఈ సినిమాతో అయినా సురేందర్ రెడ్డి కమ్ బ్యాక్ ఇస్తాడా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు