Nagachaitanya: మళ్లీ దొరికిపోయారు… శోభిత చేతిలో ప్రేమలేఖ

Nagachaitanya:

అక్కినేని నాగ చైతన్య గత కొద్ది రోజుల నుంచి ఆయన సినిమాలపై కంటే, పర్సనల్ లైఫ్ గురించి వచ్చే వార్తలే ఎక్కువగా ఉన్నాయి. సమంతతో విడాకల తర్వాత కొన్ని నెలల పాటు నాగ చైతన్య వార్తల్లో ఉన్నాడు. రీసెంట్ గా సమంత హీరోయిన్ గా చేసిన ఖుషి సినిమా రిలీజ్ అయిన తర్వాత నాగ చైతన్యపై అనేకమైన రూమర్స్ వచ్చాయి. సమంత లిప్ కిస్‌లు చూసి నాగ చైతన్య బాధపడ్డాడని, విజయ్ దేవరకొండపై రివేంజ్ తీసుకోవడానికి తన తర్వాత సినిమాలో రష్మిక మందన్నాను హీరోయిన్‌గా తీసుకోబోతున్నాడు అంటూ చాలా రూమర్స్ వచ్చాయి.

ఇది ఇలా ఉండగా, నాగ చైతన్య రెండో పెళ్లి గురించి కూడా గతంలో చాలా వార్తలు వచ్చాయి. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నాగ చైతన్య రిలేషన్ లో ఉన్నాడంటూ న్యూస్ వచ్చింది. తర్వాత వీరు ఇద్దరు ఒక రెస్టారెంట్ లో కూడా కనిపించారు. ఆ ఫోటో వైరల్ అయిన తర్వాత నాగ చైతన్య – శోభిత రిలేషన్ పై వచ్చిన వార్తలన్నీ కూడా నిజమే అనుకున్నారు. కానీ, శోభిత ఈ వార్తలను ఖండించింది. కానీ, నాగ చైతన్య మాత్రం ఇప్పటికీ దీనిపై స్పందించలేదు. దీంతో వీరి రిలేషన్ పై అనుమానులు ఏ మాత్రం తగ్గలేదు.

తాజాగా శోభిత, నాగ చైతన్య మరోసారి దొరికిపోయారు. వీరు రిలేషన్ లో ఉన్నారు అని కన్ఫామ్ చేయడానికి మరో ఉదహరణ వచ్చేసింది. అదేంటంటే? శోభిత తాజాగా ఒక ఫోటోను అభిమానులతో పంచుకుంది. ఆ ఫోటోలో శోభిత.. గ్రీన్ లైట్స్ అనే పుస్తకం పట్టుకుని ఉంది. ఈ ఫోటో కింద.. “నేను గత కొన్ని నెలలగా నుంచి చదువుతున్న అత్యుత్తమ పుస్తకాల్ల గ్రీన్ లైట్స్ ఒకటి. దీనిలో ఉన్న జీవిత కధ ఒక మంచి పాటలా ఉంటుంది. దీన్ని చదివిన తర్వాత ఏదో ఫ్రీడమ్ వచ్చిన ఫీల్ ఉంది” అంటూ కామెంట్స్ చేసింది.

- Advertisement -

దీనిలో ఏముంది? శోభిత ఓ బుక్ చదివింది అంతే కదా అని అనుకుంటున్నారా? అయితే ఈ బుక్ గురించి కొన్ని రోజుల క్రితం నాగ చైతన్య చెప్పాడు. ఈ బుక్‌ను ఉద్ధేశిస్తూ.. “జీవితానికి ఒక ప్రేమ లేఖ” అంటూ ఒక క్వోట్ కూడా రాశాడు. ఇప్పుడు అదే ప్రేమ లేఖను శోభితకు నాగ చైతన్య గిఫ్ట్ గా ఇచ్చారని, అందుకే శోభిత గ్రీన్ లైట్స్ పుస్తకాన్ని చదివింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు, నాగ చైతన్య ప్రేమ లేఖ ఇప్పుడు శోభిత చేతిలో ఉంది అని అంటున్నారు. ఇది చాలు నాగ చైతన్య – శోభిత ల మధ్య ఎంతో ప్రేమ ఉందో చెప్పడానికి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు