Shankar: ఇండియన్2 తర్వాతే గేమ్ ఛేంజర్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?

RRR తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా “గేమ్ చేంజర్“. తమిళ స్టార్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. పైగా శంకర్ తనకు అచ్చొచ్చిన పొలిటికల్ జోనర్ లో ఈ సినిమా తీస్తుండడంతో మెగా అభిమానులు భారీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తుండగా, హీరోయిన్లు గా కియారా అద్వానీ, అంజలి నటిస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాను 200కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తారని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా వస్తున్న వార్తలు రామ్ చరణ్ ఫ్యాన్స్ ను కంగారు పెడుతున్నాయి. విషయమేంటంటే శంకర్ గేమ్ చేంజర్ కంటే ముందే కమల్ హాసన్ తో ఇండియన్ 2 స్టార్ట్ చేశారన్న సంగతి తెలిసందే. అనివార్య కారణాల వల్ల ఆ షూటింగ్ ఆగిపోగా, అప్పుడు రామ్ చరణ్ తో సినిమా పట్టాలెక్కింది. కానీ ఈ సినిమా షూటింగ్ మడ్జ్హ్యలో ఉండగానే, ఇండియన్ 2 సినిమాకి వచ్చిన ఇబ్బందులన్నీ తొలగిపోవడంతో శంకర్ ఆ సినిమా కూడా స్టార్ట్ చేసాడు. రెండు సినిమాలు ఒకేసారి షిఫ్ట్ పద్ధతుల్లో షూట్ చేస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది గాని, ఇప్పుడు మరో చిక్కు వచ్చి పడింది.

ఇప్పటికే చాలా భాగం షూట్ అయిపోయిన ఇండియన్ 2 ను ముందుగా 2024 సంక్రాంతికి విడుదల చేసి, సమ్మర్ లో గేమ్ ఛేంజర్ ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని చిత్ర యూనిట్ నుంచి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజముందో తెలియదు గాని, మెగా అభిమానుల్లో కొంతమందికి ఈ వార్త నచ్చట్లేదు. ఎందుకంటే ఆచార్య తర్వాత తమ హీరో వెంటనే షూటింగ్ లో పాల్గొన్నా కూడా ఇప్పటికి షూటింగ్ కంప్లీట్ అవకపోగా, సినిమా కూడా సమ్మర్ లో విడుదల అంటే చాలా లేట్ అవుతుందని, ముందుగా గేమ్ చేంజర్ కంప్లీట్ చేసి తర్వాత ఇండియన్2 షూట్ చేయమని రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటున్నారు.

- Advertisement -

అయితే అటు ట్రేడ్ విశ్లేషకులు మాత్రం ముందుగా స్టార్ట్ అయిన ఇండియన్2 ను విడుదల చేస్తే, ఆ తర్వాత శంకర్ ఫోకస్ మొత్తం “గేమ్ చేంజర్” పై ఉంటుంది కాబట్టి, అప్పుడు ఇంకా బాగా తీయొచ్చని, తొందరగా రావడం కన్నా, మంచి సినిమా రావడం ముఖ్యమని అంటున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు