Tollywood : క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఫేడౌట్ హీరోలు… ఈ పోటీని తట్టుకోగలరా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న హీరోలకు, మిడ్ రేంజ్ హీరోలకు, కొంతమంది సీనియర్ హీరోలకు గడ్డుకాలం నడుస్తోంది. కాలంతో పాటే ప్రేక్షకులు మారిపోయారు. మరోవైపు పాన్ ఇండియా అంటూ వందల కోట్లు పోసి మరీ సినిమాలను తెరకెక్కిస్తున్న నిర్మాతల కళ్ళకు ఈ హీరోలు కనిపించడం లేదు. ఒకవేళ ఏదో ఒక విధంగా అవకాశం చేజిక్కించుకున్నప్పటికీ, అవుట్ డేటెడ్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. దీంతో సినిమా అవకాశాలు కరువయ్యి, హీరోల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మారిపోతున్నారు. మరి ఇంతకీ ఇప్పటిదాకా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిన ఆ ఫెడౌట్ హీరోలు ఎవరు? అనే విషయంలోకి వెళ్తే…

అల్లరి నరేష్…
ముందుగా చెప్పుకోవాల్సింది అల్లరి నరేష్ గురించి. కమెడియన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లరి నరేష్ కెరీర్ మొదట్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. కానీ రాను రాను ఆ కామెడీ వెగటు పుట్టించడంతో ఆడియన్స్ అతన్ని పక్కన పెట్టేశారు. దీంతో కొన్ని ప్రయోగాత్మక సినిమాలు చేశాడు. కానీ కాలం కలిసి రాలేదు. ఆయన కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలను వేళ్ళ మీదే లెక్క పెట్టొచ్చు. అల్లరి నరేష్ తెర మరుగు అవ్వడం ఖాయం అనుకుంటున్న సమయంలో “నాంది” మూవీతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. కానీ ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం సినిమాలు మళ్లీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఈ హీరో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన “నా సామి రంగ” మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించాడు. ఈ మూవీలో అంజి గాడు అనే పాత్రలో నటించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం అల్లరి నరేష్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అలా ఒకవైపు హీరోగా చేస్తూనే మరోవైపు ప్రాధాన్యత ఉన్న పాత్రలు దక్కితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారడానికి కూడా రెడీగా ఉన్నాడు ఈ హీరో.

రాజ్ తరుణ్…
ఉయ్యాల జంపాల అనే ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో రాజ్ తరుణ్. ఆ తర్వాత సినిమా చూపిస్త మావా, కుమారి 21ఎఫ్ అంటూ హ్యాట్రిక్ సక్సెస్ ను కొట్టి అందరి దృష్టిలో పడ్డాడు. కానీ ఆ తర్వాతే మొదలైంది ఈ హీరోకు కష్టకాలం. ఎన్ని సినిమాలు చేసినా ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. అందరూ దాదాపుగా మర్చిపోతున్న సమయంలో “నా సామి రంగ” మూవీలో అల్లరి నరేష్ తో పాటు మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించాడు రాజ్ తరుణ్. ప్రస్తుతం ఇతని చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాల రిజల్ట్ పైనే ఈ హీరో భవితవ్యం ఏమిటి అనేది తేలిపోతుంది.

- Advertisement -

గౌతమ్…
బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా నటించినప్పటికీ అదృష్టం మాత్రం కలిసి రాలేదు. రెండు మూడు సినిమాల్లో హీరోగా చేసినా సక్సెస్ కాలేకపోయాడు గౌతమ్. రీసెంట్ గా నాగచైతన్య “దూత” సిరీస్ లో ఓ క్యారెక్టర్ లో నటించి మెప్పించాడు.

రాజశేఖర్…
యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ కూడా ఎట్టకేలకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ సీనియర్ హీరో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో గెస్ట్ రోల్ లో మెరిశాడు. దాన్ని గెస్ట్ రోల్ అనడం కన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే బాగుంటుందేమో. ఎందుకంటే ఆ సినిమాలో ఆయన పాత్రకు అంతగా ప్రాధాన్యత ఉండదు. నెక్స్ట్ శర్వానంద్ మూవీలో రాజశేఖర్ ఆయనకు తండ్రిగా కనిపించబోతున్నాడని టాక్ నడుస్తోంది. కానీ ఈ నలుగురు హీరోలకు ఇక్కడ కూడా గట్టి పోటీనే ఉంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్న వాళ్లందర్నీ దాటుకుని వీళ్ళు నిలబడడం కష్టమే అనిపిస్తుంది.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు