Aadujeevitham Trailer : “ఆడుజీవితం” ట్రైలర్… పదేళ్ల కష్టం అద్భుతం

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రను పోషిస్తున్న మూవీ “ఆడుజీవితం – ది గోట్ లైఫ్”. డైరెక్టర్ బ్లేసీ దాదాపుగా పదేళ్లు కష్టపడి తీసిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. మరి ఇంతకీ ట్రైలర్ విశేషాలేంటి? అంటే…

ఇంట్రెస్టింగ్ గా ఆడుజీవితం ట్రైలర్…
అడ్వెంచర్ సర్వైవల్ థ్రిల్లర్ “ఆడుజీవితం” ట్రైలర్ ను మార్చ్ 9న అఫీషియల్ గా రిలీజ్ చేశారు మేకర్స్. 1 నిమిషం 33 సెకండ్ల నిడివితో ఇంటెన్స్ గా ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. మిడిల్ ఈస్ట్ దేశంలో చిక్కుకుపోయిన నజీబ్ అనే పాత్రను ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్నారు. ఎడారిలో ఆయన ఎదుర్కొనే మానసిక, శారీరక సంఘర్షణను ట్రైలర్లో అద్భుతంగా చూపించారు. ఇక్కడి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు అనే వాయిస్ ఓవర్ ట్రైలర్లో వినిపిస్తూ ఉంటుంది. ఆ ఎడారి నుంచి తప్పించుకోవడానికి ఆయన చేసే ప్రయత్నాలను ట్రైలర్ లో ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఇందులో లవ్ స్టోరీ కూడా భాగం కాబోతోంది. ఆ విషయాన్ని తెలియజేయడానికి ట్రైలర్లో అమలాపాల్ ను కూడా చూపించారు. ఆమె సైను అనే పాత్రను ఇందులో పోషిస్తుంది. సునీల్ కేఎస్ సినిమాటోగ్రఫీ ట్రైలర్ లో హైలెట్ గా నిలిచింది. అలాగే ఈ ట్రైలర్ కు ఇంటెన్సిటీని పెంచిన ప్లస్ పాయింట్స్ లో ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా ఒకటి. మొత్తానికి ట్రైలర్ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాల గ్రాఫ్ ను మరింతగా పెంచేసింది.

వాస్తవ సంఘటనల ఆధారంగా…
“ఆడుజీవితం” మూవీని రచయిత బెన్యామిన్ రాసిన బుక్ ఆధారంగా అదే పేరుతో డైరెక్టర్ బ్లేసీ తెరకెక్కించారు. ఈ మూవీ వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందింది. సౌదీ అరేబియాకు ఉపాధి కోసం వెళ్లి, బానిసగా, గొర్రెల కాపరిగా మారిన ఓ వ్యక్తి జీవిత కథ ఈ మూవీ. ఆ ఎడారి నుంచి అతడు ఎలా బయటపడ్డాడు అనేదే తెరపై చూడాల్సిన స్టోరీ. సినిమాలో పృథ్వీరాజ్, అమలాపాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా జిమ్మీ, రిక్ అబీ కీలక పాత్రలు పోషించారు. బ్లేసీ, జిమ్మీ జిన్ లూయిస్, స్టీఫెన్ ఆడమ్స్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

- Advertisement -

పదేళ్ల కష్టం…
“ఆడుజీవితం – ది గోట్ లైఫ్” మూవీనీ పదేళ్లు కష్టపడి తెరకెక్కించారు డైరెక్టర్ బ్లేసీ. ఆయన ఈ మూవీని చాలా పరిశోధనలు చేసిన అనంతరం ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. స్టోరీ, టెక్నికల్ వాల్యూస్ చూస్తుంటే అంతర్జాతీయ రేంజ్ లో మూవీ ఉండబోతుందని అనిపిస్తోంది. మలయాళ ఇండస్ట్రీ నుంచి ఈ మూవీ మరో మాస్టర్ పీస్ అవుతుందనే టాక్ మొదలైపోయింది. “ఆడుజీవితం” సినిమా మార్చ్ 28న పాన్ ఇండియా రేంజ్ లో మలయాళం, తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ కు రెడీగా ఉంది.

ప్రమోషన్స్ కూడా స్పెషలే…
“ఆడుజీవితం – ది గోట్ లైఫ్” మూవీకి సంబంధించిన ప్రమోషన్లను జోరుగా సాగిస్తోంది చిత్ర బృందం. అందులో భాగంగానే మ్యూజిక్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. మార్చ్ 10న కొచ్చిలో భారీ ఎత్తున జరగనున్న ఈవెంట్ లో ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. ఇందులో మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు పాలు పంచుకోబోతున్నారు. అందుకే భారీ స్థాయిలో మ్యూజిక్ లాంచ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు