Samantha : క్రేజీ అప్డేట్

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత గురించి తెలియని వారు ఉండరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన ఈమె, ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. అక్కినేని నాగ చైతన్యతో పెళ్లి ఆ తర్వాత విడాకులు సమంతను కొంత వరకు డిస్టర్బ్ చేసియి. దీని నుంచి కొలుకున్న తర్వాత సామ్ వరుసగా సినిమాలు చేస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేయడమే కాకుండా బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమవుతుంది.

ఇప్పటికే బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా తో సామ్ ఒక సినిమా చేస్తుందని సమాచారం అందుతుంది. దీంతో పాటు ఫ్యామిలీ మ్యాన్ 2 ను తెరకెక్కించిన రాజ్, డీకే దర్శక ద్వయంతో ఒక వెబ్ సిరీస్ చేయనుంది. దీనిలో సామ్ కు జోడీగా వరుణ్ ధావన్ నటిస్తున్నాడు. ఇది హాలీవుడ్ లో వచ్చిన సిటాడెల్ కు అధికారిక రీమేక్ గా రానుంది. ఇది మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కనుంది.

ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ నవంబర్ నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. సామ్ నటించిన శాకుంతలం సినిమా నవంబర్ 4న విడుదల కానుంది. దీని తర్వాతే సిటాడెల్ రీమేక్ షూటింగ్ జరగనుందని బాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు