Chiranjeevi: రెండోసారి అన్నయ్యగా

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య ప్లాప్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అవి గాడ్ ఫాదర్, భోళా శంకర్ తో పాటు బాబి దర్శకత్వంలో మరొక ప్రాజెక్ట్. ఇందులో గాడ్ ఫాదర్, భోళా శంకర్ రెండు సినిమాలు కూడా రీమేక్ చేస్తున్నవి. బాబి దర్శకత్వంలో వచ్చే సినిమా మాత్రం డైరెక్ట్ గా వస్తుంది. అయితే ఆచార్య తర్వాత చిరంజీవి ప్రతి సినిమాలో మరో హిరో ఉండేలా చేసుకుంటున్నాడు.

గాడ్ ఫాదర్ లో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు. భోళా శంకర్ లో ఒక యంగ్ హీరోను ఎంపిక చేసే పనిలో ఉన్నారట. అలాగే బాబి దర్శకత్వంలో వచ్చే సినిమాలో కూడా మాస్ మహారాజ రవితేజ నటిస్తున్నాడు. సినిమా సెట్స్ లోకి రవితేజ వచ్చిన వీడియోను కూడా మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమాలో రవితేజ పాత్ర ఏంటి అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు.

టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. చిరంజీవికి తమ్ముడు పాత్రలో రవితేజ నటిస్తున్నాడట. చిరు, రవితేజకు ఒకే తండ్రి ఉంటారట. కానీ తల్లి వేరు వేరు గా ఉంటారని టాక్. దాదాపు 40 నిమిషాల పాటు ఉండే ఈ పాత్రలో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని సమాచారం. కాగ చిరంజీవికి రవితేజ ఇప్పటికే అన్నయ్య అనే సినిమాలో తమ్ముడిగా నటించాడు. మళ్లీ ఇప్పుడు మరోసారి తమ్ముడుగా కనిపించబోతున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు