Censor Shocks RGV: పంచింగ్ ఫలక్నామకే పంచ్..!

కాంట్రవర్సీకి షర్ట్, ప్యాంట్ వేసినట్టుంటాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సియల్ ట్వీట్స్, స్టేట్మెంట్స్ ఇస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తనపై వచ్చే విమర్శలకు కూడా తనదైన స్టైల్ లో కౌంటర్స్ ఇస్తూ ఉంటాడు. ప్రస్తుతం వర్మ వ్యూహం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.

ఆంధ్రప్రదేశ్ రూలింగ్ పార్టీ వైఎస్సార్సీపీ కి అనుకూలంగా ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా రూపొందింది ఈ సినిమా. ఇటీవలే రిలీజైన ఈ సినిమా ట్రైలర్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల మీద ప్రత్యక్షంగా సెటైర్స్ వేయటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.  2014 ఎలక్షన్స్ లో వైఎస్ జగన్ ఓటమి దగ్గర నుండి 2019 ఎలక్షన్స్ లో వైఎస్సార్సీపీ ఘాన విజయం సాధించటం, ఆ తర్వాత నెలకొన్న పరిణామాలు ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమాను నవంబర్ 10న రిలీజ్ చేసేందుకు సిద్ధం చేసాడు ఆర్జీవీ.

Read More: RGV’s Vyuham: వ్యూహం టైటిల్ సాంగ్ లిరిక్స్ లీక్..!

- Advertisement -

అయితే, రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న క్రమంలో సెన్సార్ బోర్డ్ ఆర్జీవికి పెద్ద షాక్ ఇచ్చింది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుంది. సినిమా యూనిట్ కి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్న సమయంలోనే వర్మ టీడీపీకి వ్యతిరేకంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీసి రిలీజ్ చేయగలిగాడు. అలాంటిది ఇప్పుడు వైఎస్సార్సీపీ రూలింగ్ లో ఉన్నా కూడా సినిమాకి ఇబ్బందులు తలెత్తడం ఆశ్చర్యంగా ఉంది.

Read More: Vyuham: టార్గెట్ ‘మెగా’ – ప్రకంపనలు రేపుతున్న ఆర్జీవీ ట్వీట్..!

సినిమాలో పాత్రలకు నిజజీవితంలోని వ్యక్తుల పేర్లు పెట్టడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వ్యూహం సినిమాను సెన్సార్ రిజెక్ట్ చేయటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తన స్టేట్మెంట్స్ తో అందరికి పంచులు వేసే పంచింగ్ ఫలక్నామ లాంటి ఆర్జీవీకే సెన్సార్ పంచ్ వేసిందంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. మరి, సెన్సార్ అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకొని సినిమాలో చేంజెస్ చేస్తాడా లేక అనుకున్న సమయానికి ఓటీటీలో రిలీజ్ చేస్తాడా అన్నది వేచి చూడాలి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు