VFX Tension For Movies: ఇంకా సిగ్గు రాలేదా – మళ్ళీ అదే టెన్షన్..!

ఒకప్పుడు స్టూడియో వరకు మాత్రమే పరిమితమైన ఫిలిమ్ మేకింగ్ తర్వాత సాంకేతిక రంగంలో చోటు చేసుకున్న విప్లవాల కారణంగా ఎంతో అడ్వాన్స్ అయ్యింది. ఈ ప్రాసెస్ లో విఎఫెక్స్ ది కీలకపాత్ర అని చెప్పాలి. ఈ మధ్య కాలంలో వీఎఫెక్స్  ని వాడుకోవడంలో మన ఇండియన్ ఫిలిం మేకర్స్ కాస్త దూకుడు పెంచారు. వీఎఫెక్స్ విషయంలో హాలీవుడ్ కి పోటీ పడుతున్నారు మన వాళ్ళు.ఇక్కడి దాకా బాగానే ఉన్నా కానీ, అవసరం లేకున్నా కూడా వీఎఫెక్స్ మీద డిపెండ్ అవ్వడం వల్ల బాక్సాఫీస్ వద్ద సినిమాలు బోల్తా కొడుతున్నాయి.

Read More: Kalyan Ram’s Devil: రిలీజ్ డేట్ పై నో క్లారిటీ – డెవిల్ కి కొత్త చిక్కులు..!

సినిమా రిజల్ట్ తేడా కొట్టడమే కాకుండా బడ్జెట్ విషయంలో ప్రొడ్యూసర్స్ కి భారం అవుతోంది. ఇటీవల వీఎఫెక్స్ వర్క్ డిలే అవ్వటం వల్ల చాలా సినిమాలు అనుకున్న సమాయానికి రిలీజ్ అవ్వలేకపోతున్నాయి. భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ గా నిలిచిన ఆదిపురుష్ సినిమా ఇందుకు చక్కటి ఉదాహరణ. ఆదిపురుష్ సినిమా కూడా వీఎఫెక్స్ వర్క్స్ లో లోపాల వల్ల డిలే అవ్వడం, చివరికి అదే వీఎఫెక్స్ నాసిరకంగా ఉండటం వల్ల సినిమా డిజాస్టర్ అవ్వడం తెలిసిందే.

- Advertisement -

ఆదిపురుష్ ఎఫెక్ట్ వల్ల ప్రస్తుతం చిన్న, మీడియం సినిమా మేకర్స్ అతి జాగ్రత్త వహిస్తున్నట్లు అనిపిస్తుంది. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వటమే ఇందుకు కారణం. వీఎఫెక్స్ లో లోపాల కారణంగానే డెవిల్ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. సందీప్ కిషన్ హీరోగా రూపొందుతున్న ఊరు పేరు భైరవకోన ప్రొడ్యూసర్స్ కూడా వీఎఫెక్స్ కోసం ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. వీఎఫెక్స్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి నెగిటివ్ రిజల్ట్ అందుకున్న ఆదిపురుష్ సినిమాను చూసి కూడా వీఎఫెక్స్ కి ఇంత ప్రయారిటీ ఇవ్వటం తెలివి తక్కువ పని అనే చెప్పాలి.

Read More: Devil: ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్న కళ్యాణ్ రామ్ – ఏ మాత్రం తేడా అయినా భారీ లాస్ తప్పదు..!

డెవిల్ సినిమా అంటే పీరియాడిక్ జానర్లో రూపొందుతున్న సినిమా కాబట్టి డెవిల్ కి వీఎఫెక్స్ అవసరం ఉందని అనుకోవచ్చు. ఊరు పేరు భైరవ కోన లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకి వీఎఫెక్స్ కోసం ఎక్కువ బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలియాల్సి ఉంది. మరి, ప్రొడ్యూసర్స్ కి భారం అవ్వటమే కాకుండా సినిమా రిజల్ట్ ని మార్చేస్తున్న వీఎఫెక్స్ పట్ల మన ఫిలిం మేకర్స్ మోజు ఎప్పుడు వదులుతుందో చూడాలి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు