CBN Arrest: ఏపీ పాలిటిక్స్ దెబ్బతో చుక్కలు చూస్తున్న టాలీవుడ్..!

CBN Arrest

పాలిటిక్స్, సినిమాల మీద జనాల్లో ఎంత క్యూరియాసిటీ ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఎలక్షన్స్ దగ్గరపడుతున్న నేపథ్యంలో తెలుగు స్టేట్స్ లో పొలిటికల్ హీట్ రోజురోజుకి పెరుగుతోంది. ప్రత్యేకంగా ఏపీలో నెలకొన్న నాటకీయ పరిణామాల కారణంగా పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరిందని చెప్పాలి.

ఇదిలా ఉండగా ఏపీ పాలిటిక్స్ దెబ్బకి టాలీవుడ్ కి చుక్కలు కనిపించే పరిస్థితి నెలకొంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ గవర్నమెంట్ కి వాయతిరేకంగా పోరాడుతుండటం ఒక కారణం అయితే, ఇటీవలే మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో సీఐడీ అరెస్ట్ చేయటం మరొక కారణం.

చంద్రబాబు అరెస్ట్ ఎఫెక్ట్ టాలీవుడ్ పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల మీద పడే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్, బాలయ్య ఇప్పటికే బాబుకు మద్దతుగా గవర్నమెంట్ కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అధికార పార్టీ ఈ ఇద్దరి సినిమాలు రిలీజ్ సమయంలో లేని పోనీ ఆంక్షలతో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. పైగా పవన్, బాలయ్య ఇద్దరు టీడీపీ బాధ్యతను భుజాన వేసుకొని ఏపీలో పూర్తి స్థాయి పర్యటన చేస్తారు కాబట్టి షూటింగ్ దశలో ఉన్న సినిమాలు డిలే అయ్యే ఛాన్స్ ఉంది.

- Advertisement -

ఇక ఎన్టీఆర్ బాబు అరెస్ట్ పై స్పందించకపోవటం వల్ల టీడీపీ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ ఇంపాక్ట్ కచ్చితంగా దేవర సినిమా మీద పడుతుంది. ప్రొడ్యూసర్ అశ్విని దత్ కూడా బాబుకి మద్దతు తెలిపిన నేపథ్యంలో వైజయంతి బ్యానర్ పై రానున్న ప్రతిష్టాత్మక సినిమా కల్కి 2898AD మీద ప్రభావం చూపే అవకాశం ఉంది.

మరో పక్క పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ మిగతా మెగా హీరోల సినిమాల మీద కూడా ఉంటుంది కాబట్టి మెజారిటీ ఆఫ్ టాలీవుడ్ సినిమాలకు ఏపీలో గడ్డు కాలం దాపురించే అవకాశం ఉంది. మరి, ఈ సంక్షోభాన్ని టాలీవుడ్ ఎలా తప్పించుకుంటుందో వేచి చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు