Ram pothineni: ‘స్కంద’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ఇంకా ఛాన్స్ ఉంది?

Ram pothineni:

టాలీవుడ్ ఇస్మార్ట్ హీరో రామ్ పొతినేని హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వం లో ‘స్కంద’ అనే మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ అయ్యి మిక్సడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ఫస్ట్ డే అంచనాలకు తగ్గట్టుగానే సాలిడ్ ఓపెనింగ్స్ తో స్కంద అదరగొట్టాడు. రామ్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 10.57 కోట్ల షేర్ సాధించింది.

అయితే ఆ తర్వాతి రోజు నుండి కలెక్షన్స్ డల్ అయిపోయాయి. వీకెండ్ సెలవులు అయినప్పటికీ సినిమా బోయపాటి స్టైల్ లో రొటీన్ గా ఉండడం వల్ల మరింత దారుణంగా వసూళ్లు పడిపోయాయి. తాజాగా నాలుగు రోజుల వీకెండ్ పూర్తవగా స్కంద యావరేజ్ కలెక్షన్లను అందుకుంది అని చెప్పాలి. ఫస్ట్ డే తర్వాత మళ్ళీ నాలుగోరోజు మాత్రమే పుంజుకుంది ఈ సినిమా. ఇక స్కంద వీకెండ్ కలెక్షన్స్ ఒక్కసారి గమనిస్తే..

నైజాం : 8.16Cr
సీడెడ్ : 2.90Cr
ఉత్తరాంధ్ర : 2.48Cr
ఈస్ట్ : 1.46Cr
వెస్ట్ : 96L
గుంటూరు : 1.97Cr
కృష్ణ : 1.04Cr
నెల్లూరు : 88L
ఓవరాల్ ఏపీ, తెలంగాణ మొత్తం కలిపి 19.85 కోట్ల షేర్ సాధించగా, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 2.01CR, ఓవర్సీస్ లో 1.54CR వరల్డ్ వైడ్ గా 23.40 కోట్ల షేర్ 38కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే 47కోట్ల టార్గెట్ తో రిలీజ్ అయిన స్కంద బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 23కోట్లకి పైగా రాబట్టాలి. అయితే సోమవారం గాంధీ జయంతి పాక్షిక హాలిడే కావడం వల్ల కలెక్షన్స్ లెక్క ముందుకెళ్లే ఛాన్స్ ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు