Catherine Tresa : ఎమ్మెల్యే నుంచి విలన్..

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప సినిమా పెద్ద హిట్ కావడంతో, ఇప్పుడు దాని సీక్వెల్ తీసే పనిలో పడ్డాడు డైరెక్టర్ సుకుమార్. పుష్ప 2 మూవీ కోసం ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. పుష్ప ది రైజ్ పార్ట్ వన్ సినిమా తెలుగులోనే కాదు, రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ ప్రభంజనం సృష్టించింది. పుష్ప 1 దాదాపు 400 కోట్లు వసూలు చేయగా, పుష్పా 2 కి 1000 కోట్లు టార్గెట్ పెట్టుకుంది టీం. ఇందులో భాగంగా చిన్న పాత్రలకు సైతం పేరు ఉన్న స్టార్స్ ని తీసుకుంటున్నారు.

సుకుమార్ కూడా మరింత పక్కాగా స్క్రిప్ట్ తో బరిలోకి దిగుతున్నాడు. ఇప్పుడు బన్నీ, సుకుమార్ మొత్తం ఫోకస్ అంతా దీని మీదనే ఉంది. ఈ నేపథ్యంలో పుష్ప 2 గురించి ఆసక్తికర ప్రచారం ఒకటి సినిమాపై అంచనాలను మరింతగా పెంచేస్తుంది. ఈ సినిమాలో ఇప్పటికే అనసూయ లేడీ విలన్ పాత్ర చేయగా, నెగటివ్ షేడ్స్ ఉన్న మరో లేడీ పాత్ర కోసం స్టార్ హీరోయిన్ ను పరిశీలిస్తున్నారట.

ఆమె మరెవరో కాదు ‘యు ఆర్ మై ఎమ్మెల్యే’ పాటలో బన్నీతో చిందులేసిన హీరోయిన్ కేథరిన్ టెస్రా. సరైనోడు లో ఈమె ఎమ్మెల్యే పాత్ర చేసింది. అలాగే ఇద్దరమ్మాయిలు సినిమాలో కూడా బన్నీతో నటించింది. మళ్ళీ ఆమె పేరునే పుష్ప2 లో లేడీ విలన్ పాత్రకి బన్నీ సజెస్ట్ చేశాడట. కేథరిన్ టెస్రా చేయబోయే పాత్ర నెగిటివ్ షెడ్స్ ఉన్న పవర్ఫుల్ కాప్ అని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు