Boyapati Srinu Movie : డిజాస్టర్ తర్వాత మళ్లీ బాలయ్యతో ప్రాజెక్ట్

Boyapati Srinu Movie : భద్ర సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు బోయపాటి శ్రీను. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ ని సాధించింది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నిర్మించిన ఈ సినిమా, ఆ సంస్థకు కూడా మంచి పేరును తీసుకొచ్చింది. ఈ సినిమా రవితేజ కెరీర్ లో మంచి ప్లస్ అయిందని కూడా చెప్పొచ్చు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కొరటాల శివ రైటింగ్ ఇవన్నీ కూడా ఈ సినిమాను హిట్టు దిశగా మలిచాయి.

ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన సినిమా తులసి. వెంకటేష్ నయనతార జంటగా నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది. ఈ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ తో సింహ అనే సినిమాను తరికెక్కించాడు. బోయపాటి శ్రీను. ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనాత్మకమైన హిట్ సినిమా అని చెప్పొచ్చు. బాలకృష్ణ కెరియర్ సక్సెస్ లేక సతమతమవుతున్న తరుణంలో ఈ సినిమా వచ్చి ఒక ఘన విజయాన్ని అందించింది.

ఆ సినిమా తర్వాత వెంటనే ఎన్టీఆర్ తో దమ్ము అనే సినిమాను తెరకెక్కించాడు బోయపాటి శ్రీను. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని ఇవ్వలేదు. అప్పటికే వరుస డిజాస్టర్లతో వెళుతున్న తార కెరియర్ కు ఇది కూడా ఒక డిజాస్టర్ గా మిగిలిపోయింది. దమ్ము సినిమా తర్వాత మళ్లీ బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ తో లెజెండ్ అనే సినిమాను తెరకెక్కించాడు.

- Advertisement -

ఇకపోతే లెజెండ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘనమైన విజయాన్ని సాధించింది. బాలకృష్ణ అభిమానులకు ఒక విజువల్ ట్రీట్ ల అనిపించింది. బాలకృష్ణ నుంచి అభిమానులు ఏం కోరుకుంటారో ఏం చేస్తే బాలకృష్ణ అభిమానులు ఇష్టపడతారు దానిని క్లారిటీగా తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను అనిపించుకున్నాడు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్తో సరైనోడు అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా పరవాలేదు అనిపించుకుంది.

సరైనోడు తర్వాత చేసిన జయ జానకి నాయక, వినయ విధేయ రామ సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలాయి. రంగస్థలం వంటి హిట్ సినిమా తర్వాత చరణ్ తో వినయ విధేయ రామా అనే సినిమాను తెరకెక్కించాడు బోయపాటి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ కు గురైంది. రంగస్థలం సినిమా తర్వాత చరణ్ నుంచి వస్తున్న సినిమా కావటంపై ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. అవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా తారుమారు అయిపోయాయి.

అఖండ తర్వాత…

ఇకపోతే ఆ సినిమా తర్వాత బోయపాటి శ్రీను చేసిన సినిమా అఖండ. అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనకి తెలియంది కాదు. ఈ సినిమాతో బోయపాటి రేంజ్ ఏకంగా మారిపోయింది అని చెప్పొచ్చు. ఈ సినిమాకి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను తీసిన సినిమా స్కంద ఈ సినిమా మళ్లీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఇకపోతే ఇప్పుడు మళ్లీ బోయపాటి శ్రీను బాలకృష్ణతో సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే బోయపాటి శ్రీనుకి డిజాస్టర్ సినిమాలు పడుతున్న ప్రతిసారి బాలకృష్ణతో ఒక సినిమా సెట్ అయి ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధిస్తుంది. అయితే కేవలం మీద బోయపాటికి వర్కౌట్ అవుతుందా లేదంటే బోయపాటి కావాలని చేస్తున్నాడా అందరికీ ఒక రకమైన డౌట్ కూడా ఉంది. అందరితో సినిమాలు ఎలా ఉన్నా కూడా బాలకృష్ణ సినిమా అంటే మాత్రం ఖచ్ఛితంగా హిట్ కొడతాడు అనే ఒక నమ్మకం ఆడియన్స్ లో బోయపాటి శ్రీను పై కలిగింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు