Unstoppable: బాలయ్య అన్ స్టాపబుల్ షో ఆగినట్టేనా..?

టాలీవుడ్ లో నందమూరి కుటుంబం నుంచి ఎంట్రీ ఇచ్చిన హీరోలలో బాలకృష్ణ కూడా ఒకరు.. బాలకృష్ణ చైల్డ్ యాక్టర్ నుంచి తన సినీ కెరీర్ ని మొదలుపెట్టి హీరోగా మారి ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకున్నారు. తన కెరియర్ లో ఎన్నో రికార్డులను సైతం సృష్టించిన నటుడుగా కూడా బాలయ్య పేరు పొందారు. ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలతో చాలా బిజీగా ఉండేవారు. గడిచిన కొన్ని ఏళ్ల క్రితం నుంచి బాలయ్య మొదటిసారి హోస్ట్ గా అన్ స్టాపబుల్ షో కి వ్యవహరించడం జరిగింది.

అనూహ్యంగా భారీ స్పందన రావడంతో భారీ క్రేజ్ కూడా పెరిగిపోయింది. ఈ షో కి స్టార్ హీరోలందరూ కూడా గెస్ట్ గా వస్తు ఉన్నారు. దీంతో బాలయ్య తన మాటలతో కామెడీ డైలాగులతో మరింత ఈ షో కి అట్రాక్షన్ గా నిలిచారు . ఇప్పటివరకు రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ టాక్ షో ఇప్పుడు మూడవ షో కి సిద్ధమవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే సీజన్ 3 ప్రారంభం కాకముందే భగవంత్ కేసరి, యానిమల్ చిత్రాలకు సంబంధించి పలు రకాల ప్రమోషన్స్ సైతం చేసి స్పెషల్ ప్రోమోలను విడుదల చేయడం జరిగింది.

 

- Advertisement -

దీంతో అభిమానులు సైతం బాలయ్య హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్-3 ఎప్పుడు మొదలవుతుందా అంటూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇందుకు గెస్టుగా ఏ సెలబ్రెటీ వస్తారు అంటూ ఎదురు చూస్తున్న సమయంలో అభిమానులకు ఒక సడన్ షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. అందరూ కూడా సీజన్ 3 ని చేయడానికి నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారనుకుంటూ ఉండగా తాజాగా అన్ స్టాపబుల్ టాక్ షో ఆగిపోయింది అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

అయితే ఇలా సందేహం రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఈ అన్ స్టాపబుల్ షో కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఒక ఫ్లోర్లో సెట్ లో నిర్వహించేవారట.. అయితే ఇప్పుడు హఠాత్తుగా ఆ సెట్ ను అక్కడి నుంచి తొలగించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. దీంతో ఈ షో ఆగిపోయిందని ప్రచారం కూడా ఎక్కువగా వినిపిస్తోంది. అన్ స్టాపబుల్ అంటే ఎవరు ఆపలేనిది అని అర్థం వస్తుంది. కానీ ఈ షో మాత్రం ఆగిపోయింది అంటూ పలు రకాల రూమర్స్ సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. మరి బాలయ్య సినిమాలలో, రాజకీయాలలో బిజీగా ఉండడం చేత ఈ షోని ఏమైనా ఆఫ్ చేసి ఉండవచ్చు అంటూ అభిమానులు తెలుపుతున్నారు. మరి ఈ షోపై ఆహా టీం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

 

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు