2018: సైలెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన చిన్న సినిమా..!

‘2018’ మలయాళంలో బ్లాక్ బ్లాస్టర్ గా నిలిచి తెలుగులోకి డబ్ అయ్యి ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. పెద్దగా ప్రమోషన్స్ ఏమీ లేకుండా సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మౌత్ టాక్ తో తొలి రోజు నుండి డీసెంట్ కలెక్షన్స్ సొంతం చేసుకొని సూపర్ హిట్ గా నిలిచింది. 5వ రోజు 84లక్షల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా మొత్తం 5 రోజులకు గాను 6కోట్ల రూపాయల గ్రాస్, 2.87కోట్ల షేర్ రాబట్టి లాభాలతో దూసుకుపోతోంది. ఒక చిన్న సినిమా అందులోను డబ్బింగ్ సినిమా ప్రమోషన్స్ పెద్దగా లేకున్నా కానీ, 5రోజుల్లోనే ప్రాఫిట్స్ అందుకోవటం అరుదనే చెప్పాలి. 2018లో కేరళలో వచ్చిన వరదలను కళ్ళకు కట్టినట్టు చూపించేలా విజువల్స్ ఉండటం, కథలో ఎమోషనల్ కనెక్షన్ ఉండటం వల్ల తెలుగు ప్రేక్షకుడు ఈ సినిమా ఆదరిస్తున్నాడు.

సినిమాలో కంటెంట్ ఉండాలి కానీ, భాషతో సంబంధం లేకుండా ఆడియెన్స్ ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ చేసింది ఈ సినిమా. 2018 సినిమాలో ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అవ్వటంతో తెలుగులో కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది. మౌత్ టాక్ కి ఉన్న పవర్ ఏంటో 2018 సినిమాకి వచ్చిన కలెక్షన్స్ చూస్తే అర్థమవుతుంది.

2018 సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నిర్మాత బన్నీ వాసు, ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర అంశాన్ని వెల్లడించాడు. 2018లో కేరళలో వరదలు వచ్చిన సమయంలో గీత గోవిందం సినిమాను అక్కడ రిలీజ్ చేయగా పెద్దగా కలెక్షన్స్ రావని భావించిన బన్నీ వాసు, ఆ కలెక్షన్స్ మొత్తాన్ని కేరళ ప్రభుత్వానికి విరాళం ఇస్తానని అనౌన్స్ చేశాడట. తీరా చూస్తే, ఆ సినిమా 65లక్షల షేర్ రాబట్టిందని, ఆ మొత్తానికి కేరళ ప్రభుత్వానికి ఇచ్చానని చెప్పాడు. అప్పట్లో కేరళకు తాను చేసిన సాయం ఈ సినిమా కలెక్షన్స్ రూపంలో తిరిగొస్తుందని వెల్లడించాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు