Biggboss season 7: నాగార్జున ముందే ‘ఇక ఎప్పటికి క్షమించను’ అనేసిన శోభా!

బిగ్ బాస్ సీజన్ 7 లో ఆట రసవత్తరంగా తయారయ్యింది. ఈ సీజన్లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఎంట్రీ తర్వాత షో లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త కంటెస్టెంట్ అంబటి అర్జున్ తన ఆటతో పాత హౌస్ మేట్స్ కి టఫ్ కాంపిటేషన్ ఇవ్వడమే గాక, ఈ వారం ఏకంగా కెప్టెన్ బ్యాడ్జ్ కూడా గెలుచుకున్నాడు.

అయితే ఈ వారం నామినేషన్ లో భాగంగా కంటెస్టెంట్స్ మధ్యలో చాలా వాగ్వాదం జరిగింది. ముఖ్యంగా భోలే, శోభా శెట్టి మధ్యలో గొడవ గట్టిగానే జరిగింది. ఈ వాగ్వాదంలో భాగంగా భోలే ఆవేశంతో శోభని నీకు ఎర్రగడ్డే దిక్కు అని మాట తూలాడు. అంటే తనకి పిచ్చి పట్టింది అన్న ఉద్దేశంలో అన్నాడు. ఈ మాటకి చాలా హర్ట్ అయ్యింది శోభ.

ఆ తర్వాత శోభని క్షమించమని భోలే అన్నా, తాను వినలేదు. తాజాగా నాగార్జున ముందే మరోసారి క్షమాపణలు కోరినా, తాను మాత్రం ఈ విషయంలో క్షమించేది లేదని తేల్చి చెప్పింది. దాంతో నాగార్జున కూడా భోలే కి గట్టి వార్నింగ్ ఇచ్చి ఇకనైనా జాగ్రత్తగా ఆడమని చెప్పాడు. ఆ తర్వాత కూడా భోలే మరోసారి సారీ చెప్తే, తాను బిగ్ బాస్ బయటికి వెళ్లినా కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పింది. మరి బిగ్ బాస్ లో శోభా, భోలే ఉన్నన్ని రోజులు, వీళ్ళ మధ్య ఎలాంటి రభస జరుగుతుందో తెలీదు గాని, ఆడియన్స్ కి మాత్రం ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు