మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సముద్రఖని దర్శత్వంలో తమిళ సినిమా వినోదాయ సీతాం రీమేక్ గా వస్తున్న బ్రో సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్న పోస్టర్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతుండగా, నార్మల్ ఆడియెన్స్ లో సినిమాపై ఆసక్తి పెంచుతోంది. మోషన్ పోస్టర్ కి థమన్ అందించిన సంగీతం పవన్ కళ్యాణ్ లుక్స్ ని మరింత ఎలివేట్ చేసేలా ఉంది. ఇదిలా ఉండగా బ్రో సినిమా విషయంలో మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమా కోసం అన్నపూర్ణ 7ఎకర్స్ లో భారీ స్థాయిలో పబ్ సెట్ వేశారని, ఆ సెట్లో ఒక సాంగ్, ఒక ఫైట్ షూట్ చేయనున్నారని సమాచారం. సెట్ ఇప్పటికే పూర్తి కాగా, త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తారని అంటున్నారు. గతంలో చాలా సినిమాల్లో పబ్ సెట్ వేసినప్పటికీ, ఇంత భారీ రేంజ్ లో పబ్ సెట్ వేయటం ఇదే మొదటిసారి అని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జులై 28న విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ5 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలావరకు పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుపుకుంటుంది. భారీ పబ్ సెట్లో ఫైట్, సాంగ్ అంటూ వస్తున్న వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ, వినోదాయ సీతాం సినిమాకి, బ్రో సినిమాకి చాలా మార్పులు ఉండనున్నాయని స్పష్టం అవుతోంది. మరి, విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సాయిధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన ఈ సినిమా ద్వారా మరొక హిట్ అందుకుంటాడా లేదా చూడాలి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News