Filmfare Awards 2022 : జోరు చూపించిన పుష్ప

67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం బెంగళూరులో జరిగింది. ఈ అవార్డులు 2020, 2021 రెండు సంవత్సరాలకు ఇవ్వబడ్డాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గత రెండేళ్లలో విడుదలైన అల్లు అర్జున్ సినిమాలు అల వైకుంఠపురం లో.. , పుష్ప రెండు సినిమాలు ఎక్కువ‌గా అవార్డుల‌ను ద‌క్కించుకోవ‌డం విశేషం. ఈ రెండు చిత్రాలతో పాటు,  విమర్శకుల ప్రశంసలు పొందిన శ్యామ్ సింగ రాయ్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు నాని. విజేతల పూర్తి జాబితా ఇక్కడ ఉంది.
ఉత్తమ చిత్రం – పుష్ప: ది రైజ్
ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ (పుష్ప: ది రైజ్)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – నాని (శ్యామ్ సింఘా రాయ్)
ఉత్తమ కొరియోగ్రఫీ – శేఖర్ మాస్టర్ (అల వైకుంఠపురములో)
ఉత్తమ సినిమాటోగ్రఫీ – మిరోస్లా కుబా బ్రోజెక్ (పుష్ప: ది రైజ్)
లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు – అల్లు అరవింద్
ఉత్తమ నటి – సాయి పల్లవి (లవ్ స్టోరీ)
ఉత్తమ నటి (క్రిటిక్స్) – సాయి పల్లవి (శ్యామ్ సింగ రాయ్)
ఉత్తమ దర్శకుడు – సుకుమార్ (పుష్ప: ది రైజ్)
ఉత్తమ సహాయ నటుడు – మురళీ శర్మ (అల వైకుంఠపురములో)
ఉత్తమ సహాయ నటి – టబు (అల వైకుంఠపురములో)
ఉత్తమ తొలి నటుడు –  వైష్ణవ్ తేజ్ (ఉప్పెన)
ఉత్తమ తొలి నటి – కృతి శెట్టి (ఉప్పెన)
ఉత్తమ సంగీత ఆల్బమ్ – దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప: ది రైజ్)
ఉత్తమ సాహిత్యం – సిరి వెన్నెల సీతారామ శాస్త్రి (జాను)
ఉత్తమ గాయకుడు – సిద్ శ్రీరామ్ (పుష్ప: ది రైజ్)
ఉత్తమ గాయని – ఇంద్రావతి చౌహాన్ (పుష్ప: ది రైజ్)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు