Biggboss season 7: బెడ్ గెలుచుకున్న ప్రియాంక..!

Biggboss season 7:

స్టార్ మా లో బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ గా రన్ అవుతుంది. గత సీజన్ల లా కాకుండా అంతా ఉల్టా పల్టా గా సాగుతుందని బిగ్ బాస్ చెప్పగా, టాస్క్ ల పరంగా అలాగే సాగుతుంది. గత సీజన్ల లలో దాదాపు 20 మంది కంటెస్టెంట్స్ కూడా పాల్గొనగా, ఈ సీజన్లో మాత్రం 14 మంది మాత్రమే ఎంట్రీ ఇచ్చారు. అయితే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఈ వారం కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే బిగ్ బాస్ లో ఇప్పటికే అలవాటైన కంటెస్టెంట్స్ బదులు కొత్త వారికి ఆడియన్స్ కనెక్ట్ అయినప్పటికీ వోట్ వేసే అవకాశం తక్కువ.

ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు బిగ్ బాస్ ఒక ప్రమోషనల్ టాస్క్ నిర్వహించగా, ఆ టాస్క్ లో ‘సెంచరీ మాట్రస్’ అనే కంపెనీ యొక్క ప్రమోషనల్ టాస్క్ పెట్టడం జరిగింది. అయితే ఈ టాస్క్ ఒక బెడ్ పై కంటెస్టెంట్స్ షటిల్ ని మార్చుకుంటూ కింద పడకుండా పట్టుకోవాలి అంటారు. ఎవరైతే జారవిడుస్తారో వాళ్ళు ఆట నుండి బయటికి వచ్చేస్తారు అని టాస్క్ రూల్ లో ఉంది. గెలిచిన వారికి ఆ బెడ్ పై ఒకరోజు కంఫర్టబుల్ గా నిద్రపోయే ఛాన్స్ ఉంటుందని బిగ్ బాస్ చెప్పడం జరిగింది.

ఈ క్రమంలో అందరూ సరదాగా ఆడుతూ ఒక్క్కొకరు వైదొలగుతూ ఉండగా, ఫైనల్ గా అమరదీప్, ప్రియాంక ఇద్దరి మధ్య జరగగా, ప్రియాంక విన్ అయింది. ఇకపోతే ఈ వారం అయిన టాస్క్ లలో చిన్న టాస్క్ ఇదే కావడం విశేషం. అదీ గాక ఎవర్ని నొప్పించకుండా సరదాగా అయిన టాస్క్ కూడా ఇదే.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు