HIT2 : మొదటి రోజు కలెక్షన్లు

శైలేష్ కొలను హిట్ ఫ్రాంఛైజీలో ఇప్పటికే ఒక సినిమా రిలీజ్ అయింది. హిట్ : ది ఫస్ట్ కేస్ పేరుతో మొదటి సినిమా చేశాడు. దీనిలో విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. ఇది 6.2 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా.. 18 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అడివి శేష్ తో హిట్ : ది సెకండ్ కేస్ సినిమాను డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించాడు. మీనక్షీ చౌదరి హీరోయిన్ గా నటించగా, వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ హీరో నాని నిర్మించాడు. ఈ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది.

ప్రీమియర్ షో నుంచే హిట్2 కు పాజిటివ్ టాక్ వచ్చింది. తర్వాత సిని విశ్లేషకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుని మంచి రివ్యూలను పొందింది. అయితే ఈ సినిమా మొదటి రోజు ఎంత వరకు కలెక్షన్లు చేసిందో ఇప్పుడు చూద్ధాం.

హిట్ 2 ప్రపంచ వ్యాప్తంగా 14.25 కోట్ల బిజినెస్ చేసుకుంది. అంటే.. సినిమా బ్రేక్ ఈవెన్ అందాలంటే.. దాదాపు 15 కోట్ల వసూళ్లు రావాలి. కాగా మొదటి రోజు వసూళ్లు ఇలా ఉన్నాయి.

- Advertisement -

నైజం : 1.92 కోట్లు
సీడెడ్ : 38 లక్షలు
ఉత్తరాంధ్ర : 53 లక్షలు
గుంటూరు : 33 లక్షలు
ఈస్ట్ : 29 లక్షలు
కృష్ణ : 24 లక్షలు
వెస్ట్ : 19 లక్షలు
నెల్లూరు : 15 లక్షలు

వసూళ్లు చేసింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని 4.3 కోట్ల షేర్ ను రాబట్టింది. 6.9 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. అలాగే..

కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా : 45 లక్షలు
ఓవర్సీస్ : 1.95 కోట్ల

ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే 6.43 కోట్ల షేర్ కలెక్షన్స్ చేసింది. అలాగే 11.27 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది.

హిట్2 బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే ఇంకా 8.57 కోట్ల కలెక్షన్లు రావాలి. ప్రస్తుతం ఈ సినిమాకు ఉన్న టాక్ ను చూస్తే.. ఈ వారంలోనే బ్రేక్ ఈవెన్ అందుకోవచ్చని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు