Naa Saami ranga: నైట్ నాగార్జున వచ్చాడు 

మామూలు సీజన్లో కంటే ఎక్కువ శాతం సినిమాలు పండగ సీజన్లో రిలీజ్ కావడానికి సిద్ధమవుతుంటాయి. ఎందుకంటే ఒక యావరేజ్ సినిమా కూడా పండగలో మంచి కలెక్షన్స్ను వసూలు చేస్తుంది. అదే సినిమా సూపర్ హిట్ అయితే బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ను వసూలు చేస్తుంది. ప్రతి సంవత్సరం బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో సినిమాలు సంక్రాంతి బరిలో తలపడుతుంటాయి. వాటిలో ఒక సినిమాకి హిట్ టాక్ వస్తే ఆ సినిమా కలెక్షన్స్ విషయంలో పై చేయి సాధిస్తుంది.

2024 సంక్రాంతి బరిలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ అంచనాలు పెట్టుకున్న సినిమాలు కొంతమందిని నిరాశపరిచాయి. అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం సినిమా ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. ఇది ఒక మాస్ కమర్షియల్ సినిమా అని థియేటర్ కి నమ్మి వచ్చిన ఆడియన్స్ కి, ఇది ఒక ఫ్యామిలీ సినిమా అని రియలైజేషన్ వచ్చేలోపే ఆ సినిమా డిజాస్టర్ టాక్ బయటకు వచ్చేసింది.

గుంటూరు కారం సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చినా కూడా ఆ సినిమా కొంత మేరకు మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. దీనికి కారణం త్రివిక్రమనే ఒక బ్రాండ్ అలానే మహేష్ బాబు అనే ఒక స్టార్ డం మెయిన్ కారణమని చెప్పొచ్చు. ఇదే సినిమాకు మొదటి షో తోనే మంచి టాక్ వచ్చి ఉంటే కలెక్షన్స్ వేరే రేంజ్ లో ఉండేవని చాలామంది సినీ ప్రముఖులు చెబుతుంటారు.

- Advertisement -

అయితే చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అలానే నాగర్జున నటించిన నా సామిరంగా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. అలానే మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది. చాలామంది హీరోలతో పాటు నాగర్జున సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉంటుంది. ఇంతకుముందు సోగ్గాడే చిన్నినాయన బంగారు రాజు వంటి సినిమాలు సంక్రాంతి బరిలో రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించాయి.

ఇకపోతే రీసెంట్ గా రిలీజ్ అయిన చాలా సినిమాలు నెల తిరిగిలోపే ఓటిటి లో ప్రత్యక్షమవుతూ ఉంటాయి. గుంటూరు కారం సినిమా నెలరోజుల కంటే ముందే ఓటిటికి వచ్చేసింది. ఇప్పుడు నాగార్జున నటించిన నా సామిరంగ సినిమా, అర్ధరాత్రి నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. థియేటర్లో మిస్ అయిన ఆడియన్స్ ఈ సినిమాను ఓటిటి లో చూసి ఎలా రెస్పాండ్ అవుతారో వేచి చూడాల్సిందే.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు