Kantara : అప్పుడేనా ?

కాంతారా సినిమాకు ప్రస్తుతం అందరూ ఫిదా అవుతున్నారు. కాంతారా చిత్రానికి వచ్చినంత మౌత్ పబ్లిసిటీ, పాజిటివ్ మరే చిత్రానికి కూడా రాలేదు. ఈ మధ్యకాలంలో కాంతారా చిత్రం అందరి నోళ్ళల్లో నానుతోంది. కన్నడలో ప్రభంజనం సృష్టించిన కాంతారా చిత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. కాంతారా దెబ్బకు అన్ని ఇండస్ట్రీలు షాక్ అవుతున్నాయి.

రిషబ్ శెట్టి నటన, డైరెక్షన్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు. రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతారా చిత్రం ఇప్పుడు కలెక్షన్లలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. కన్నడలో 100 కోట్లు కలెక్ట్ చేసిన అతి కొద్ది చిత్రాల్లో కాంతారా నిలిచింది. కాంతారా దెబ్బకు కేజీఎఫ్ రికార్డులు సైతం బద్దలయ్యాయి. కన్నడలో ఈ చిత్రం కేవలం రెండు వారాల్లోనే 100 కోట్లు కొల్లగొట్టేసింది. పైగా ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలిస్తే అంత షాక్ అవ్వాల్సిందే. కనీసం 20 కోట్లు కూడా పెట్టని ఈ సినిమాకు, కేవలం కన్నడలోనే 100 కోట్లు వచ్చాయి.

ఈ సినిమాని థియేటర్స్ లో చూడలేకపోతున్న ప్రేక్షకులు ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న వాళ్లకి ఓ గుడ్ న్యూస్ చెప్పింది చిత్ర బృందం. నవంబర్ 4న కాంతారా ఓటిటీ లో విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఓటీటీ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్న‌ట్టు తెలుస్తోంది. అయితే తెలుగులో ఈ సినిమాను బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ‘ గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ లో రిలీజ్ చేశారు. అరవింద్ కి ఆహా సొంత ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఉంది. మరి కాంతారా సినిమాను అమెజాన్ ప్రైమ్ తో పాటు ఆహా కూడా పంచుకుంటుందా? అన్నది తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు