Indian 2 : పంజాబ్ సింహం సిద్ధం

ద‌ర్శ‌కుడు శంక‌ర్, క‌మ‌ల్ హాస‌న్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన భారతీయుడు సినిమా ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఈ చిత్రం వ‌చ్చి దాదాపు 21 ఏళ్లు పూర్త‌వుతున్నా ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఈ మూవీపై ఉన్న  క్రేజ్ మాత్రం తగ్గలేదు. వీరి కాంబోలో ఇప్పుడు ‘ఇండియన్-2’ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియంట్ మూవీస్ బ్యానర్ లపై ఏ. సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అంచనాలకు తగ్గట్టే మేకర్స్ కూడా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రముఖ ఇండియన్ క్రికెటర్ తండ్రి ఓ కీలకపాత్రలో పోషిస్తున్నాడు. అత‌ను మ‌రెవ్వ‌రో కాదు. టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఇక ఈ విషయాన్ని స్వయంగా యోగ్ రాజ్ వెల్లడించారు. ఇన్ స్టాగ్రామ్ లో తనకు మేకప్ వేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. “కెమెరా వెనుక పనిచేసే అందరికీ ధన్యవాదాలు. నన్ను మరింత స్మార్ట్ గా తయారు చేస్తున్న మేకప్ మెన్ కు ప్రత్యేక ధన్యవాదాలు. కమల్ హాసన్ తో ఇండియన్-2 లో నటించడానికి పంజాబ్ సింహం సిద్ధంగా ఉంది” అంటూ పోస్ట్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు