Samantha : ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

హీరోయిన్ సమంత నటించిన యశోద సినిమా ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. శ్రీదేవి పతాకం పై ప్రముఖ నిర్మాత శివ లెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో ఈ సినిమా రిలీజ్ అయింది. ముఖ్యంగా సమంత నటనపై చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు.

యాక్షన్ సన్నివేశాలలో సమంత ప్రాణం పెట్టి చేసిందని, ఈ మూవీ కోసం ఆమె ఎంత కష్టపడిందో తెరపై కనిపిస్తుందంటూ చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నిర్మాతలకు భారీగానే లాభం వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు తొలి రోజు ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. రూ. 2.94 కోట్లు, రెండో రోజు రూ.2.82 వచ్చాయి. ఇక మూడో రోజున రూ.2.61 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి.

ఇక సోమవారం రోజున ఈ సినిమా కలెక్షన్ల పై.. ఓ పోస్టర్ విడుదల చేశారు నిర్మాతలు. నిర్మాతలు తెలిపిన వివరాల ప్రకారం ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ దాదాపు 20 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో నిర్మాతలు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఈ సినిమా ఎక్కడ కూడా సులువు అయ్యే అవకాశం లేదని ట్రేడ్ పండితులు కూడా చెబుతున్నారు. 

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు