Koratala : లేట్ ఎందుకు ?

నందమూరి ఫ్యాన్స్ ఇప్పుడు దేని కోసం ఎదురుచూస్తున్నారు అని అంటే.. వెంటనే అందరి నోటి నుంచి NTR30 అనే సమాధానం వస్తుంది. NTR30 ప్రకటన వచ్చి చాలా రోజులు అవుతుంది. ఈ ఏడాది మే 28న ఒక వీడియోను కూడా విడుదల చేశారు. మూడు నెలలు గడుస్తున్నా, ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. కనీసం సినిమాలో నటించే నటీనటులను కూడా ఎంపిక చేయలేదు. ముఖ్యంగా హీరోయిన్ ఎంపిక విషయంలో రోజుకు ఒక వార్త బయటకు వస్తుంది.

ఇప్పటి వరకు దాదాపు 10 మంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ముందుగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ను డైరెక్టర్ కొరటాల శివ ఫైనల్ చేశాడు. ఆలియా కూడా దీన్ని కన్ఫామ్ చేసింది. అయితే అనివార్య కారణాల వల్ల ఆలియా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో హీరోయిన్ కోసం కొరటాల వేట ప్రారంభించాడు. అప్పటి నుంచి సమంత, జాన్వీ కపూర్, అనన్య పాండే, దిశా పటానీ, రష్మికా మందన్నాతో పాటు బాలీవుడ్ లో మరి కొందరి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.

తాజాగా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ఫిక్స్ అయిందని సోషల్ మీడియా కోడై కూస్తుంది. అయితే దీనిపై మేకర్స్ స్పందించారు. NTR30లో ఇంకా హీరోయిన్ ను ఫిక్స్ చేయలేమని ప్రకటించారు. సోషల్ మీడియలో ఇప్పటి వరకు వచ్చిన పేర్లు అని కూడా అబద్ధమని వెల్లడించారు. దీంతో ఈ సినిమాలో హీరోయిన్ పాత్రపై మరోసారి చర్చకు వచ్చింది. ఇంత మంది హీరోయిన్లను కాకుండా మరి ఎవరిని ఎంపిక చేస్తారు అంటూ ఫ్యాన్స్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అలాగే హీరోయిన్ పాత్రకు ఇంతా ప్రాధాన్యత ఉందా అని కూడా అంటున్నారు.

- Advertisement -

హీరోయిన్ పాత్రపై కొరటాల ఎందుకు క్యూరియాసిటీ పెంచుతున్నాడు? అసలు ఎన్టీఆర్ సినిమాకు హీరోయిన్లు దొరకడం లేదా? అంటూ అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వీటికి సమాధానం రావాలంటే దర్శకుడు కొరటాల నుంచే నొరువిప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు