Tollywood : ఇండస్ట్రీకి అసలేమైంది

టాలీవుడ్ లో మళ్లీ మంచి సినిమాలు రావడం లేదు. ఆగస్టు ప్రారంభంలో సీతారామం, బింబిసార, కార్తికేయ2 లాంటి సినిమాలు వచ్చి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చాయి. కానీ, కార్తికేయ2 తర్వాత వచ్చిన సినిమాలు ప్రేక్షకులను దారుణంగా నిరాశపరిచాయి. భారీ అంచనాలతో వచ్చిన లైగర్ సినిమా బాక్సాఫీస్ ముందు బొక్కబోర్లపడింది. 180 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పటి వరకు కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా 72 కోట్ల వరకు మాత్రమే వచ్చాయి. మొత్తంగా నిర్మాతలకు నష్టాలు పెద్ద మొత్తంలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి.

అలాగే ఆది సాయి కుమార్ నటించిన తీస్ మార్ ఖాన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో పాటు ఆగస్టు 31న వచ్చిన కోబ్రా సినిమా కూడా ప్రేక్షకులను నిరాశకు గురి చేసింది. చియాన్ నట విశ్వరూపం చూపించినా, ఫలితం మాత్రం పాజిటివ్ గా రాలేదు. రంగ రంగ వైభవంగా, ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాలతో సెప్టెంబర్ నెల ప్రారంభమైంది. నిజానికి ఈ రెండు చిన్న సినిమాలే. కానీ, వీటిపై అంచనాలు భారీగా ఉన్నాయి. మేజర్ హిట్ కాలేకపోయిన, కంటెంట్ పరంగా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని భావించారు.

కానీ ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయ్యాయి. రంగ రంగ వైభవంగా పూర్తిగా అవుట్ డేటెడ్ సినిమా అని రివ్యూలు వస్తున్నాయి. అలాగే జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ కథ, స్క్రిన్ ప్లే అందించిన ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా తీవ్రంగా నిరాశపరిచిందని సినీ విశ్లేషకులు రివ్యూలు ఇస్తున్నారు. మొత్తంగా టాలీవుడ్ కు సెప్టెంబర్ ఓపెనింగ్ నిరాశే దక్కింది. ఇక ఆశలన్నీ రాబోయే సినిమాలపైనే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు