Vikram : విక్రమ్ విధ్వంసం

కోలీవుడ్ అంటేనే గుర్తువచ్చే పేర్లు రజినీకాంత్, కమల్ హాసన్. ఈ అగ్ర హీరోల నుండి సినిమాలు వస్తున్నాయంటే, ఒక తమిళ ప్రేక్షకులే కాదు, సౌత్ ఆడియన్స్ మొత్తం చూస్తారు. 2.o సినిమాతో రజినీకాంత్ 800 కోట్ల వరకు కలెక్షన్లు సాధించి కోలీవుడ్ లోనే అత్యధిక వసూళ్లు తీసుకువచ్చిన హీరోగా రికార్డు నమోదు చేశాడు. తమిళ ఇండస్ట్రీలో ఈ రికార్డును ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయలేదు. కమల్ హాసన్ కనీసం రెండో స్థానంలో కూడా లేడు.

ఇదిలా ఉండగా, కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో, విజయ్ సేతుపతి, ఫహద్ ఫజిల్ తో పాటు అతిథి పాత్రలో సూర్య కనిపించారు. ఈ మూడు పాత్రలు సినిమాకే హైలైట్ టచ్ అయ్యాయి. ఈ సినిమా ఊహించిన దాని కంటే, సూపర్ హిట్ అయింది. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా రికార్డులను కొల్లగొడుతూ వచ్చింది.

విక్రమ్ విడుదలై మూడు వారాలు గడుస్తున్నా, జోరు మాత్రం తగ్గడం లేదు. కలెక్షన్లు ఆగడం లేదు. ఇప్పటి వరకు ఈ సినిమా 400 కోట్లు వసూళ్లు చేసింది. దీంతో తమిళంలో అత్యధిక వసూళ్లు చేసిన రెండో సినిమాగా నిలిచింది. మొదటి స్థానంలో రజినీకాంత్ 2.o ఉన్న విషయం తెలిసిందే.

- Advertisement -

దీంతో కోలీవుడ్ అగ్ర హీరోలు ఇద్దరు కలెక్షన్ల పరంగా అగ్రస్థానంలో ఉన్నారని సినీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు