Vijay deverakonda Films : రౌడీ హీరో నుంచి ఆ సినిమాలు రావా..?

Vijay deverakonda Films : రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలతో సమానంగా అతి తక్కువ సమయంలోనే ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకొని ఇప్పుడు భారీ స్థాయిలో సినిమాలను విడుదల చేస్తున్నారు. అర్జున్ రెడ్డి, గీతాగోవిందం సినిమాలతో భారీగా పాపులారిటీ దక్కించుకున్న ఈయన గీతా గోవిందం తర్వాత ఆ రేంజ్ హిట్ అయితే మళ్లీ పడలేదని చెప్పాలి. ఇక ఆ తర్వాత వచ్చిన టాక్సీవాలా పరవాలేదు అనిపించుకుంది.. కానీ నోట, ద్వారకా, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ సినిమాలు మాత్రం పూర్తిస్థాయిలో డిజాస్టర్ గా నిలిచాయి.. ఇక గత ఏడాది విడుదలైన ఖుషీ సినిమా మాత్రం పరవాలేదు అనిపించుకుంది. దీంతో రేపు రిలీజ్ అవ్వబోయే ఫ్యామిలీ స్టార్ సినిమా పైనే అందరి అంచనాలు అయితే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం విజయ్ దేవరకొండ లో ఎక్కువగా కనిపిస్తోంది..

ఆ జానర్ లో మాత్రం నటించను..

ఇకపోతే తాజాగా ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న విజయ్ దేవరకొండ కొన్ని విషయాలను వెల్లడించారు.. వాస్తవానికి విజయ్ దేవరకొండ ( Vijay deverakonda Films ) ఇప్పటికే యాక్షన్ , లవ్, కామెడీ, సూపర్ నాచురల్, పొలిటికల్ ఇలా అన్ని జానర్స్ ని టచ్ చేసారు.. కానీ ఇప్పుడు అలాంటి జానర్ లోమాత్రం నటించను అని తెలిపి తన సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. నేను ఎలాంటి జానర్ సినిమాలైనా.. ఏ డైరెక్టర్ తో అయినా సినిమా చేయడానికి సిద్ధం.. కానీ హారర్ సినిమాలు మాత్రం చేయను.. ఎక్కువమంది ఆడియన్స్ కి రీచ్ అయ్యే సినిమాలే ఎక్కువగా చేయాలనుకుంటున్నాను.. వాస్తవానికి హారర్ సినిమాలకి అందరూ కనెక్ట్ అవ్వలేరు. నేను కూడా హారర్ సినిమాలు చూసి ఎంజాయ్ చేయలేను.. అందుకే హారర్ సినిమాలలో విజయ్ ను మీరు చూడలేరు అంటూ విజయ్ తెలిపారు.. అంతే కాదు తాను కూడా హారర్ సినిమాలు చూడనని తెలిపారు విజయ్ దేవరకొండ.. మొత్తానికైతే విజయ్ దేవరకొండ చేసిన ఈ కామెంట్లకు అభిమానులు కూడా ఫిక్స్ అవుతున్నారు.. ఇకపై విజయ్ నుంచి హారర్ సినిమాలను తాము ఎక్స్పెక్ట్ చేయలేము అని కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి విజయ్ దేవరకొండ తర్వాత కాలంలో నైనా సరే తన అభిప్రాయాలను మార్చుకుంటారేమో చూడాలి..

ఫ్యామిలీ స్టార్ సినిమా విశేషాలు..

విజయ్ దేవరకొండ హీరోగా , మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా, పరుశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫ్యామిలీ స్టార్.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.. ఇక రేపు అనగా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. మార్చి 4వ తేదీన ఈ సినిమా టీజర్ ను విడుదల చేసి సినిమాపై భారీ అంచనాలను పెంచేశారు చిత్ర బృందం. దీంతో విజయ్ దేవరకొండ తో పాటు అభిమానులు కూడా సినిమాపై అంచనాలను పెట్టుకున్నారు. మరి రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక ఇందులో అజయ్ ఘోష్, అభినయ, రోహిణి హట్టంగడి, వాసుకి , కోటా జయరాం, జబర్దస్త్ రాంప్రసాద్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు