Vidya Sagar: సీనియర్ దర్శకుడు కన్నుమూత

గత కొన్ని నెలలుగా టాలీవుడ్ లో ఎన్నో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.కొన్ని రోజుల క్రితమే సీనియర్ హీరోయిన్ జమున కాలం చేసిన విషయం తెలిసిందే. వారం కూడా తిరగకుండానే ఇప్పుడు ఇంకో విషాదం చోటు చేసుకుంది.

సీనియర్ డైరెక్టర్ విద్య సాగర్ రెడ్డి ఈరోజు తెల్లవారు జామున 5 గంటల 20 నిమిషాలకి తుది శ్వాస విడిచారు. ఆయన కొన్ని నెలలుగా లివర్ సమస్యతో బాధపడుతూ చెన్నై లో చికిత్స తీసుకుంటున్నారు. అంత బానే ఉంది అనుకున్న సమయంలో పరిస్థిథి విషమించటం తో తాను చికిత్స పొందుతున్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కన్ను ముసారని తన కుమారుడు తెలిపాడు.

విద్య సాగర్ 1952లో గుంటూరులో జన్మించారు. ‘రాకాసి లోయ’ అనే సినిమాతో దర్శకుడిగా తన కెరీర్ ను స్టార్ట్ చేసారు. స్టూవర్టుపురం దొంగలు, ఖైదీ బ్రదర్స్, అమ్మదొంగ, అన్వేషణ వంటి చిత్రాలకి దర్శకత్వం వహించారు.

- Advertisement -

తన కెరీర్లో 3 నంది అవార్డులు గెలుచుకున్నారు. అంతే కాకున్నా, తెలుగు సినిమా దర్శకుల సంఘానికి అధ్యక్షులుగా 3 సార్లు పని చేసారు. ఇప్పుడు వీరి అకాల మరణానికి తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు నివాళ్లు అర్పిస్తున్నారు.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు