Vennela Kishore : ‘ఈగో కా బాప్’ ఫస్ట్ లుక్

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న మాస్, కమర్షియల్ చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది. ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇప్పటికే ప్రమోషన్ పనులను కూడా ప్రారంభించారు. ఈ సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు, మోషన్ పోస్టర్ కొంత వరకు నిరాశ పర్చాయి. కానీ, ఇటీవల వచ్చిన రా రా రెడ్డి సాంగ్ తో ఒక్క సారిగా బజ్ పెరిగిపోయింది. ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి తాజా గా వెన్నెల కిషోర్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. మాచర్ల నియోజకవర్గం సినిమాలో గుంతలకడి గురునాధం అనే పాత్రలో వెన్నెల కిషోర్ కనిపించబోతున్నాడు. ఈ పాత్రను షార్ట్ కట్ లో గురు అని పిలుస్తారని పోస్టర్ ద్వారా మేకర్స్ తెలిపారు. అంతేకాదు వెన్నెల కిషోర్ పాత్రకు ‘ఇగో కా బాప్’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ క్యాప్షన్ తో కిషోర్ పాత్రపై ఇంట్రెస్ట్ పెరిగింది. ‘ఇగో కా బాప్’ క్యాప్షన్ కి తగ్గట్టుగానే ఫస్ట్ లుక్ లో వెన్నెల కిషోర్ చాలా సీరియస్ గా చూస్తూ ఇచ్చిన ఇగోయిస్టిక్ ఎక్స్ ప్రెషన్ ఆకట్టుకుంటుంది.

ఇదిలా ఉండగా మాచర్ల నియోజకవర్గం సినిమాతో ఎం.ఎస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. అలాగే నితిన్ సరసన కృతిశెట్టి, కేథరిన్ థ్రెసా నటిస్తున్నారు. రా రా రెడ్డి అనే స్పెషల్ సాంగ్ లో అంజలి సందడి చేస్తోంది. ప్రతి నాయకుడి పాత్రలో సముథ్ర ఖని కనిపిస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు