Varasudu : “వారసుడు” అలాగే ఉంటుందా ?

తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు, పీవీపీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మిక మందన ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. హీరో విజయ్ పుట్టినరోజు కావడంతో ఈ చిత్రానికి సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రానికి తమిళంలో ‘వరిసు’ అని తెలుగులో ‘వారసుడు’ అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు అధికారిక ప్రకటన ఇచ్చారు. ‘ది బాస్ రిటర్న్స్’ అనేది క్యాప్షన్ అని తెలిపారు.

అయితే ఈ చిత్రం రెండు సూపర్ హిట్ సినిమాల పోలికలతో రూపొందుతున్నట్లు ఇన్సైడ్ టాక్. ఒకటి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘బావగారు బాగున్నారా’ సినిమా కాగా, మరొకటి అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం అని తెలుస్తోంది. వారసుడు సినిమా స్టోరీ దాదాపు ఈ సినిమాలనే పోలి ఉంటుందట. ఓ పెద్ద ఇంటికి హీరోయిన్ తరుపున హీరో అతిథిగా రావడం, కట్ చేస్తే ఆ పెద్దింటి వారసుడే ఈ హీరో అని అక్కడి జనాలు తెలుసుకోవడం, క్లైమాక్స్ లో ఎమోషనల్ సన్నివేశాలు, మిగిలిన తతంగం. ఇలాగే ఈ సినిమా ఉండబోతుందని వినికిడి. ఇది నిజమో కాదో ఖచ్చితంగా చెప్పలేము కానీ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలు దాదాపు పాత సినిమా కథల్నే పోలి ఉంటాయి. కాకపోతే సినిమాని కమర్షియల్ ఎలిమెంట్స్ తో నీట్ గా ప్యాక్ చేసి అందిస్తూ, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు