Tollywood : విజయ్ vs అజిత్..

సంక్రాంతి కోళ్ల పందాలు ఎలా ఉంటాయో.. బాక్సాఫీస్ వద్ద సినిమాలు కూడా అలాగే పోటీ పడుతుంటాయి. ప్రతి సంవత్సరం కంటే ఈ ఏడాది సంక్రాంతి పోరు ఆసక్తికరంగా ఉంది. రోజు రోజుకు పోటీ రసవత్తరంగా మారుతోంది. దీనికి కారణం.. ఈ సారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడేది అందరూ అగ్ర హీరోలే. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సై అంటున్నారు. అలాగే తమిళంలో తలపతి విజయ్, అజిత్ పొంగల్ పోరు కు సిద్ధమయ్యారు. ఈ చిరు, బాలయ్య తెలుగులో ఎలాగు అగ్ర హీరోలే. వీరికి థియేట్రికల్ హక్కులు, థియేటర్స్, ఓపెనింగ్స్ భారీ స్థాయిలో ఉంటాయి.

అయితే తమిళ స్టార్స్ విజయ్, అజిత్ కు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికే వీరి సినిమాలు తెలుగు చాలా రికార్డులను నమోదు చేశాయి. దీంతో వారు నటిస్తున్న వారిసు, తునివు సినిమాలను సంక్రాంతి పోరులో భాగంగా తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. అంతే కాదు.. ప్రమోషన్లను కూడా భారీ స్థాయిలో చేయడానికి సన్నాహాకాలు చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరిని తెలుగు ఇండస్ట్రీతో పోల్చకుంటే.. అజిత్ కంటే విజయ్ కాస్త మెరుగ్గా ఉన్నాడు. దీని కారణం.. తెలుగు నిర్మాత దిల్ రాజ్.

వారిసు సినిమాను దిల్ రాజు స్వయంగా నిర్మిస్తున్నాడు. దీంతో వారిసుపై తమిళంలో ఎంత హైప్ ఉందో.. తెలుగులోనూ అంతే ఉంది. థియేట్రికల్ హక్కులు గానీ, థియేటర్లు లెక్కలు గానీ వారిసుకు భారీ స్థాయిలో ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. టాలీవుడ్ అగ్ర హీరోలు చిరు, బాలయ్య సినిమాలకు పోటీని ఇచ్చేలా వారిసు ఉంది.

- Advertisement -

కానీ అజిత్ తునివుకు మాత్రం అలాంటి పరిస్థితులు లేవు. ఈ సినిమాపై తమిళంలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. కానీ తెలుగులో మాత్రం అజిత్ హవా నడవడం లేదు. సినిమా రిలీజ్ ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికీ కూడా తునివు యూనిట్ తెలుగుకు సంబంధించి ప్రమోషనల్ పనులు ఏ మాత్రం స్టార్ట్ చేయలేదు.

దీంతో సినిమాపై హైప్ లేదు. దాని ప్రభావం తెలుగు రైట్స్ పై పడింది. తునివు తెలుగు రైట్స్ ను కొనుగోలు చేయడానికి ఎవరూ కూడా ముందుకు రాలేదట. దీంతో ఈ భారీ ప్రాజెక్ట్ తెలుగు రైట్స్ ను కేవలం మూడు అంటే మూడే కోట్లకు అమ్ముడుపోయాయని టాక్. దీనిని రాధాకృష్ణ ఎంటర్ టైన్ మెంట్స్ అనే సంస్థ తీసుకుందని తెలుస్తోంది. ఒక వేళ తునివు టీం తెలుగులో ప్రమోషన్స్ ను వారిసుడు లెవెల్ లో చేస్తే మరింత రేటు పలికేది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు