Tollywood : సంక్రాంతి పోరుకి డేట్స్ ఫిక్స్

మన తెలుగు రాష్ట్రాల్లో సినిమా అంటే పండుగ, పండుగ అంటేనే సినిమా అన్న స్థాయికి చేరుకుంది. సంక్రాంతి అంటే కోళ్లపందాల పేరుతో కోళ్లు పోటీ పడతాయి.అలాగే బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోలు కూడా పోటీపడతారు. సంక్రాతి వస్తుందంటే ఆరు నెలల ముందు నుంచే సినిమాల హడావుడి మొదలవుతుంది. దర్శకనిర్మాతలు ఈ పండుగ వాతావరణాన్ని క్యాచ్.. క్యాష్ చేసుకోవడానికి క్యూ కడతారు.

ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా స్టార్ హీరోలు తమ సినిమాలతో అలరించబోతున్నారు. సంక్రాంతికి బరిలో ఉన్నామంటూ ఇప్పటికే వాల్తేరు వీరయ్యతో మెగా స్టార్ చిరంజీవి, వీర సింహా రెడ్డితో బాల్లయ్య ప్రకటించగా తమిళ హీరోలు సైతం సంక్రాంతి పోరుకు సై అంటున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్ ‘తునివు’ మరియు విజయ్ ‘వారిసు’ సినిమాలతో సంక్రాతి రేస్ లో నిలుస్తున్నారు.

ఈ తమిళ హీరోలకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. అది క్యాచ్ చేసుకోవడానికి వారి సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ భారీ స్థాయిలో ప్రొమోషన్స్ కూడా చేస్తున్నారు. కాగా ఈ నలుగురు అగ్ర హీరోలు సంక్రాంతికి వస్తున్నామంటూ ప్రకటించినా డేట్స్ మాత్రం ఇంకా కంఫార్మ్ కాలేదు.

- Advertisement -

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అజిత్ ‘తునివు’ జనవరి 11న, బాల్లయ్య ‘వీర సింహా రెడ్డి’ తోపాటు విజయ్ ‘వారిసు’ జనవరి 12న, మెగా స్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న రిలీజ్ అవుతున్నాయట. వీటిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరి ఈ సంక్రాతి పోరులో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు