Orange: అప్పుడు ఫ్లాప్ ఇప్పుడు క్లాసిక్

తరం మారుతున్న కొద్ది ఆలోచనలు అభిప్రాయాలు మారుతుంటాయి.
ఇది సినిమాల విషయంలో ఎక్కువగా జరుగుతుంది. ఆ ఫలానా సినిమా అప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు వచ్చి ఉంటె సూపర్ హిట్ అయ్యుండేది అని సినీ ప్రేమికులు, సినీ అభిమానులు చేతులు పిసుకున్నే సంధర్బాలు ఎన్నో ఉన్నాయి. అప్పట్లో ప్లాప్ అయినా ఎన్నో సినిమాలను ఇప్పుడు క్లాసిక్ గా గుర్తిస్తున్నారు ప్రేక్షకులు.

మగధీర వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత రామ్ చరణ్ కెరియర్ లో వచ్చిన సినిమా ఆరెంజ్. ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించాడు. మెగా బ్రదర్ నాగబాబు నిర్మించాడు. మగధీర తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు హరీష్ జయరాజ్ ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించాడు. ఇప్పటికి ఆరెంజ్ సినిమా ట్యూన్స్ ఫ్రెష్ గా అనిపిస్తాయి.
ప్రేమ కొంతకాలం మాత్రమే బాగుంటుంది అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా తీవ్ర నిరాశకు గురి చేసింది. నిర్మాత నాగబాబు కు తీవ్ర నష్టాలను తీసుకొచ్చింది.

తాజాగా ఈ చిత్రం విడుదలై 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియా లో అభిమానులు ఆరెంజ్ సినిమా కొన్ని వీడియోస్ ను పోస్ట్ చేస్తూ, ఇది ఒక క్లాసిక్ అంటూ భారీ ఎత్తున పోస్ట్స్ వేశారు. కొందరైతే మళ్ళీ రిలీజ్ చేయమని నాగబాబుకి ట్యాగ్ కూడా చేశారు. దీనికి నాగబాబు కూడా స్పందించి త్వరలోనే స్పెషల్ అకేషన్ లో ప్లాన్ చేస్తామని హామీ ఇచ్చేశారు.ఏదేమైనా ఒకప్పుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని తీసుకొచ్చిన సినిమాను ఇప్పుడు రీ రిలీజ్ కి సిద్ధం చేయడం గమ్మత్తయిన విషయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు