Cinema : సెంటిమెంట్‌ లేకుంటే కష్టమేనా ?

తమ సినిమా మెప్పించాలి, హిట్ కొట్టాలి, బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయి కలెక్షన్లు రాబట్టాలి అంటే ప్రేక్షకులను సెంటిమెంట్ తో కొట్టాలని డైరెక్టర్స్ అనుకుంటున్నారు. ప్రేక్షకులు కూడా అలాంటి సెంటిమెంటల్ సినిమాలకే పడిపోతున్నారు. ఆయా సినిమాలను హిట్ చేస్తున్నారు. అందుకే కాబోలు.. ఈ సంవత్సరం హిట్ అయిన సినిమాలు అన్ని కూడా సెంటిమెంట్ నేపథ్యంలోనే వచ్చాయి. అలాగే సంక్రాంతి కానుకగా వచ్చిన నాలుగు సినిమాల్లో మూడు కూడా ఈ తరహాలోనేవి.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా తమ్ముడు సెంటిమెంట్ తో ఉంది. సినిమాలో రవితేజ, చిరంజీవి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. తమ్ముడి సెంటిమెంట్ ను చివరి వరకు క్యారీ చేసి, ప్రేక్షకులను మెప్పించడంలో డైరెక్టర్ బాబీ సక్సెస్ అయ్యాడు.

అలాగే నందమూరి బాలయ్య హీరోగా నటించిన వీర సింహ రెడ్డి సినిమా చెల్లి సెంటిమెట్ తో వచ్చింది. అన్నగా బాలయ్య, చెల్లిగా వరలక్ష్మీ శరత్ కుమార్ నటించారు. ఇంటర్వెల్ సన్నివేశంలో వీరి మధ్య వచ్చిన సీన్ పీక్స్. ఇక సెకండాఫ్ లో వరలక్ష్మీ శరత్ కుమార్ నుంచి కావాల్సిన ఎమోషన్ వచ్చింది. మొత్తంగా సినిమాలో అన్నా – చెల్లి సెంటిమెంట్ ప్రేక్షకులకు కన్నీరు తెప్పించింది.

- Advertisement -

అలాగే ఇదే సంక్రాంతి బరిలో వచ్చిన మరో సినిమా వారిసు (తెలుగులో వారసుడు). ఈ సినిమా తండ్రి సెంటిమెంట్ తో వచ్చింది. కొడుకు పాత్రలో దళపతి విజయ్, తండ్రి పాత్రలో శరత్ కుమార్ నటించారు. వీరి ఇద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా ప్రేక్షకులను మెప్పించాయి. ఈ సెంటిమెంటల్ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. అందువల్లే మంచి విజయాన్ని దక్కించుకుంది. అలాగే రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతుంది.

తాజాగా ఈ రోజు వచ్చిన రైటర్ పద్మ భూషణ్ సినిమా కూడా ఇదే తరహాలో ఉంది. అమ్మ సెంటిమెంట్ తో వచ్చిన ఈ విభిన్న సినిమా ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా ఉన్నాయి. సినిమా ఎండ్ కార్డ్స్ లో కాస్ట్ అండ్ క్రూ తమ తల్లులతో కలిసి ఉన్న ఫోటోలను వేయడం మరింత ఆట్రాక్ట్ చేస్తోంది. మొత్తంగా ఈ తెలుగు సినిమా డైరెక్టర్ అమ్మ సెంటిమెంట్ ను ప్రేక్షకుల్లోకి బలంగానే తీసుకెళ్లాడు.

ఇలా ఈ మధ్య కాలంలో హిట్ అయిన సినిమాలు సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చాయి. ఇదే సెంటిమెంట్ తో మరిన్నీ సినిమాలు వచ్చినా, హిట్ అయ్యే సూచనలు కూడా ఉన్నాయని తాజాగా వచ్చిన రైటర్ పద్మ భూషణ్ తో తెలిసిపోతుంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు