VJ Sunny : దోపిడీ నేపథ్యంలో..

బిగ్ బాస్ బులి తెర యాక్టర్స్ కు మంచి ప్లాట్ ఫామ్ గా నిలుస్తూ వస్తుంది. ఎందరో జీవితాలని సెట్ చేసింది ఈ రియాలిటీ షో. సీజన్ 5 ట్రోఫీ గెలిచి అందరి ద్రుష్టిని అక్కట్టుకున్నాడు VJ సన్నీ. కల్యాణ వైభోగమే అనే సీరియల్ తో బుల్లి తెర యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు హీరో స్థాయి వరకు ఎదిగాడు. ATM అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ట్రైలర్ చుస్తే సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కినట్టు తెలుస్తుంది. ATM దొంగగా VJ సన్నీ కనిపించబోతున్నాడు. సన్నీ మరియు అతని ఫ్రెండ్స్ కలసి చేసే దోపిడీలు వారి జీవితాలని ఏ విధంగా మలుపు తిప్పబోతుంది అన్నదే ఈ చిత్రంగా చూపించబోతున్నట్టు ట్రైలర్ తో తెలుస్తుంది. సన్నీకి జోడిగా బిగ్ బాస్ సీజన్ 3 ఫేమ్ దివి నటించారు.

థియేటర్ రిలీజ్ కు వెళ్లకుండా ఈ సినిమాను నేరుగా OTTలో విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం జీ 5లో ఈ చిత్రం జనవరి 20 నుంచి స్ట్రీమ్ కానున్నట్టు తెలిపారు.

- Advertisement -

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు