Samyuktha Menon: స్టార్ హీరోయిన్ కెరీర్ డౌన్ అవ్వడానికి రీజన్ ఏంటి?

సంయుక్త మీనన్.. కొన్ని రోజుల క్రింది వరకు ఇండస్ట్రీలో బాగా వినిపించిన పేరు ఇది. ఒకటి రెండు కాదు.. ఈ ముద్దుగుమ్మ నటించిన నాలుగు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించడంతో సంయుక్త రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ మలయాళీ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో ముఖ్యపాత్రలో నటించి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆ తరువాత ఈ బ్యూటీ నటించిన బింబిసారా, సార్, విరూపాక్ష చిత్రాలు సూపర్ హిట్ కావడంతో ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ అవుతుందని అంతా భావించారు.

అంతేకాదు ఈమె ఇండస్ట్రీలో ఓ బడా డైరెక్టర్ హెల్ప్ తోనే అవకాశాలు దక్కించుకుంటుందన్న వార్తలు కూడా వినిపించాయి. ఆ దర్శకుడు ఈమెకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నాడని.. రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేసిందని వార్తలు వినిపించాయి. కానీ ప్రస్తుతం ఈమె కళ్యాణ్ రామ్ తో కలిసి నటిస్తున్న డెవిల్ తప్ప ఇతర ఏ సినిమాలకు ఓకే చెప్పలేదు. కొత్త కథలను డైరెక్టర్స్ ఆమె ఇంటి వద్దకు తీసుకువెళ్లినా సరే రిజెక్ట్ చేస్తుందట.

అయితే కేవలం తెలుగు సినిమాలను మాత్రమే రిజెక్ట్ చేస్తుండడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. దీంతో సంయుక్త ఎందుకు సైలెంట్ అయిపోయిందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆ బడా డైరెక్టర్ ఆమెకు హ్యాండ్ ఇచ్చి మరో బ్యూటీని పట్టుకోవడమే దీనికి కారణమని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.

- Advertisement -

కానీ ఆమె అభిమానులు మాత్రం ఆమె పర్సనల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కారణంగా బాధపడుతుందని.. ఆ కారణంగానే ఇండస్ట్రీకి కొన్నాళ్లపాటు బ్రేక్ చెప్పిందని అంటున్నారు. ఇందులో అసలు విషయం ఏంటో తెలియాలంటే ఆమె నోరు విప్పాల్సిందే ..!

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు