Telangana Assembly elections 2023 : రెండుసార్లు ఓటు వేయడం ఎగ్గొట్టిన ప్రభాస్… ఎందుకంటే ?

తెలంగాణ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం తగ్గింది. చాలా మంది సెలబ్రిటీలు ఉదయాన్నే క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు పెద్ద ఎత్తున వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ సెంటర్లలో మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, నమ్రత, రామ్ చరణ్ , అల్లు అర్జున్, రవితేజ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, రానా దగ్గుబాటి , నాని తదితరులు జూబ్లీహిల్స్, పరిసర ప్రాంతాల్లోని సెంటర్లలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం ఓటు వేయలేదు.

టాలీవుడ్ టాప్ హీరోలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటే, డార్లింగ్ ఎక్కడా కనిపించలేదు. దానికి కారణం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. గత కొంతకాలంగా బయట కన్పించని ప్రభాస్ నిన్న అయినా తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. టాలీవుడ్ సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పనులన్నీ వదులుకోవడం విశేషం. రామ్ చరణ్ అయితే మైసూర్‌లో షూటింగ్ స్కిప్ చేసి మరీ వచ్చాడు. కానీ హైదరాబాద్ లోనే ఉన్న ప్రభాస్ మాత్రం ఓటు వేయలేదు. అయితే ప్రభాస్ యూరప్‌లో మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుని ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చాడు. ప్రభాస్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ రెస్ట్ మోడ్‌లో ఉన్నట్లు సమాచారం. “సలార్” ట్రైలర్ ఎటువంటి ఈవెంట్ లేకుండా నేరుగా యూట్యూబ్‌లో విడుదల చేయాలనే ఆలోచన వెనుక కారణం అదే. ఓటు వేయకుండా ఆయన గైర్హాజరు కావడానికి ఇదే కారణం కావచ్చు. కానీ మరోవైపు ‘కల్కి’ సెట్లో ప్రభాస్ ఉన్నాడనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రభాస్ మణికొండ ఉన్నత పాఠశాలలో ఓటు వేయాల్సింది.

గత సారి కూడా ప్రభాస్ తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. పాన్ ఇండియా స్టార్ క్రేజ్ ఉన్న స్టార్ ప్రభాస్ యూత్ కు ఐకాన్ అని చెప్పొచ్చు. కారణంగా ఏదైనా ఇలా ఓటు వేయకుండా ఎగ్గొట్టడం ఎంత వరకు కరెక్టు? ఆయన ఓటు వేసి, దాని విలువ ఏంటో తెలియజేస్తే, అది నేటి తరం యూత్ ఎంతో మందిని ప్రభావితం చేసే అవకాశం ఉంది. కానీ తానే ఓటు వేయకుండా సమాజానికి ప్రభాస్ ఏం సందేశం ఇద్దామని అనుకుంటున్నాడు? అంటూ ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ లోనే ఉండి కూడా ఏదో ఒక సాకుతో ఇలా ఓటు హక్కును వాడుకోకపోవడం ఆయన ఫ్యాన్స్ ను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు